Telugu Global
National

జాతీయగీతాలాపనను నిషేధించిన పాఠశాల

ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో బోఘరా లోని ఎం.ఎ. కాన్వెంట్ పాఠశాల మేనేజర్ జాతీయ గీతాలాపనను నిషేధించాడు. జాతీయ గీతాన్ని ఆలపించడం ఇస్లాంకు వ్యతిరేకమన్న భావనతో ఆయన వచ్చే ఆగస్టు 15న జనగణమన పాడొద్దని హుకుం జారీ చేశారు. ఆ పాఠశాల మేనేజర్ జియా ఉల్ హఖ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయగీతాలాపనను నిషేధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో సహా ఏడుగురు ఉపాధ్యాయులు కూడా తమ ఉద్యోగాలు వదిలేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. జాతీయ […]

జాతీయగీతాలాపనను నిషేధించిన పాఠశాల
X

ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో బోఘరా లోని ఎం.ఎ. కాన్వెంట్ పాఠశాల మేనేజర్ జాతీయ గీతాలాపనను నిషేధించాడు. జాతీయ గీతాన్ని ఆలపించడం ఇస్లాంకు వ్యతిరేకమన్న భావనతో ఆయన వచ్చే ఆగస్టు 15న జనగణమన పాడొద్దని హుకుం జారీ చేశారు. ఆ పాఠశాల మేనేజర్ జియా ఉల్ హఖ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

M.A. Schoolజాతీయగీతాలాపనను నిషేధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో సహా ఏడుగురు ఉపాధ్యాయులు కూడా తమ ఉద్యోగాలు వదిలేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. జాతీయ గీతాలాపన నిషేధంపై దర్యాప్తు చేయడానికి అలహాబాద్ పరిపాలనా విభాగం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. అంటే ఇది చట్ట విరుద్ధంగా పని చేస్తున్నట్టు లెక్క. అనేక సంవత్సరాలుగా ఆ పాఠశాలలో నిషేధం ఉందని ఇప్పుడు ఈ విషయాన్ని బహిరంగ పరచాలని ఉపాధ్యాయులు నిర్ణయించి ఉద్యోగాలు మానుకున్నందువల్ల ఈ వ్యవహారం అందరి దృష్టికి వచ్చింది.

జనగణమన గీతంలో కొన్ని భాగాలు అభ్యంతరకరంగా, ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నందువల్లే నిషేధించానని పాఠశాల మేనేజర్ సమర్థించుకున్నాడు. ప్రజల భవిష్యత్తును నిర్దేశించింది అల్లా ఒక్కడే అన్నది ఆయన వాదన. జియా ఉల్ హఖ్ మీద దేశద్రోహ నేరం మోపారు.

First Published:  9 Aug 2016 8:01 PM GMT
Next Story