నాని నుంచి మరో సినిమా….

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్ మెన్… ఇలా నానికి అద్భుతమైన టైటిల్స్ పడుతున్నాయి. కేవలం టైటిల్స్ మాత్రమే కాదు… ఆ సినిమాలతో నాని సూపర్ హిట్స్ కూడా కొడుతున్నాడు. పైన చెప్పుకున్న 3 సినిమాలు హిట్టే. అలా హ్యాట్రిక్ అందుకున్న ఈ హీరో… ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో నేను లోకల్ అనే సినిమాను ప్రారంభించాడు.
ప్రస్తుతం మజ్ను అనే సినిమా చేస్తున్నాడు నాని. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా కొనసాగుతుండగానే… త్రినాథరావు దర్శకత్వంలో నేను లోకల్ అనే సినిమాను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు. సినిమా చూపిస్త మామ సినిమాతో పేరుతెచ్చుకున్న త్రినాథరావు… నానికి అద్భుతమైన స్టోరీలైన్ వినిపించాడు. వెంటనే నాని ఒప్పుకోవడం,.. దిల్ రాజు బ్యానర్ లో సినిమా స్టార్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే హ్యాట్రిక్ అందుకున్న నాని… మజ్ను, నేను లోకల్ సినిమాలతో తన సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తాడని ఆశిద్దాం.