Telugu Global
National

మోదీకి వ్య‌తిరేకంగా ప్ర‌వీణ్‌ తొగాడియా కామెంట్లు!

ద‌ళితులపై జ‌రుగుతున్న దాడుల విష‌యంలో మోదీకి- హిందూ ధార్మిక సంస్థ విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌కు భేదాభిప్రాయాలు త‌లెత్తాయా?  మోదీపై  విశ్వ‌హిందూ ప‌రిష‌త్ సీనియ‌ర్ నేత ప్ర‌వీణ్ తొగాడియా చేసిన కామెంట్ల‌ను చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది. గోర‌క్ష‌కుల‌పై మోదీ చేసిన కామెంట్స్ ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇటీవ‌ల గుజ‌రాత్‌లోని ఉనాతోపాటు దేశంలో మ‌రికొన్ని చోట్ల ఆవుల‌ చర్మాలు ఒలిచార‌న్న నెపంతో ద‌ళితుల‌పై దాడులు జ‌రిగాయి.  గోర‌క్ష‌ణ కోసం ఆర్ ఎస్ ఎస్‌, వీహెచ్ పీలు పోరాడుతున్న సంగ‌తి […]

మోదీకి వ్య‌తిరేకంగా ప్ర‌వీణ్‌ తొగాడియా కామెంట్లు!
X
ద‌ళితులపై జ‌రుగుతున్న దాడుల విష‌యంలో మోదీకి- హిందూ ధార్మిక సంస్థ విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌కు భేదాభిప్రాయాలు త‌లెత్తాయా? మోదీపై విశ్వ‌హిందూ ప‌రిష‌త్ సీనియ‌ర్ నేత ప్ర‌వీణ్ తొగాడియా చేసిన కామెంట్ల‌ను చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది. గోర‌క్ష‌కుల‌పై మోదీ చేసిన కామెంట్స్ ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇటీవ‌ల గుజ‌రాత్‌లోని ఉనాతోపాటు దేశంలో మ‌రికొన్ని చోట్ల ఆవుల‌ చర్మాలు ఒలిచార‌న్న నెపంతో ద‌ళితుల‌పై దాడులు జ‌రిగాయి. గోర‌క్ష‌ణ కోసం ఆర్ ఎస్ ఎస్‌, వీహెచ్ పీలు పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే! ఇటీవ‌ల తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో మోదీ ఈ విష‌యంలో సంచ‌ల‌న కామెంట్లు చేశారు. గోర‌క్ష‌కుల ముసుగులో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఖండించాల‌ని జాతికి పిలుపునిచ్చారు. మ‌రో అడుగు ముందుకేసి ద‌ళితుల‌ను కాల్చాల‌నుకుంటే.. ముందు త‌న‌ను కాల్చాల‌ని స‌వాలు విసిరారు.
ద‌ళితుల‌కు మ‌ద్దుతుగా చేసిన ఈ కామెంట్లు ప‌లువురిని ఆలోచింప‌జేశాయి. అయితే, ఆర్ ఎస్ ఎస్‌, వీహెచ్‌పీ లాంటి సంస్థ‌లతో చ‌ర్చించాకే ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసి ఉంటార‌ని భావించారంతా. గోర‌క్ష‌కుల‌పై చేసిన కామెంట్ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని వీహెచ్ పీ నేత ప్ర‌వీణ్ తొగాడియా డిమాండ్ చేయ‌డంతో ఈ కామెంట్లు మోదీ వ్య‌క్తిగ‌త‌మ‌ని స్ప‌ష్ట‌మైంది. వ‌చ్చే ఏడాది ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, గుజరాత్ రాష్ర్టాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇటీవ‌లి కాలంలో ఈ రెండు రాష్ర్టాల్లో ద‌ళితుల‌పై దాడులు పెరిగాయి. దీంతో ప‌లు హిందూ అగ్ర‌వ‌ర్ణాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. బీజేపీ చిర‌కాల ఓటు బ్యాంకుగా నిలుస్తోన్న అగ్ర‌వ‌ర్ణాల‌ను కాపాడుకునేందుకు, ద‌ళితుల ఓట్లు జారిపోకుండా ఉండేందుకే మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న‌ది సుస్ప‌ష్టం. ఈ వ్యాఖ్య‌ల కార‌ణంగా బీజేపీకి- వీహెచ్‌పీ మ‌ధ్య త‌లెత్తిన అభిప్రాయ భేదాలు ఇలాగే కొన‌సాగుతాయా? టీ క‌ప్పులో తుపానులా స‌మ‌సిపోతాయా? అన్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది.
First Published:  13 Aug 2016 10:59 PM GMT
Next Story