Telugu Global
National

ఇక రైలుతో సెల్ఫీ...జైలుకే!

దూసుకువ‌స్తున్న రైలు… ఫొటోలో క‌నిపించేలా ప‌ట్టాల ప‌క్క‌న నిల‌బ‌డి సెల్ఫీలు తీసుకుంటున్న‌వారి పిచ్చికి రైల్వేశాఖ అడ్డుక‌ట్ట వేయ‌బోతోంది. రైల్వేస్టేష‌న్లో సెల్ఫీలు తీసుకుంటే ఇక‌పై రైల్వే చ‌ట్టం 1989 లోని మూడు సెక్ష‌న్ల ప్ర‌కారం శిక్ష‌లు వేయ‌నున్నారు.  ముందుగా ఈ విష‌యంపై అహ్మ‌దాబాద్ రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అక్క‌డి రైల్వే పోలీస్ అధికారులు హెచ్చ‌రించారు. సెల్ఫీలో ట్రాక్ కనిపిస్తే 147వ సెక్ష‌న్‌, ట్రాక్‌తో పాటు ట్రైన్ కూడా క‌న‌బ‌డితే 145, 147 సెక్ష‌న్ల ప్ర‌కారం కేసులు […]

ఇక రైలుతో సెల్ఫీ...జైలుకే!
X

దూసుకువ‌స్తున్న రైలు… ఫొటోలో క‌నిపించేలా ప‌ట్టాల ప‌క్క‌న నిల‌బ‌డి సెల్ఫీలు తీసుకుంటున్న‌వారి పిచ్చికి రైల్వేశాఖ అడ్డుక‌ట్ట వేయ‌బోతోంది. రైల్వేస్టేష‌న్లో సెల్ఫీలు తీసుకుంటే ఇక‌పై రైల్వే చ‌ట్టం 1989 లోని మూడు సెక్ష‌న్ల ప్ర‌కారం శిక్ష‌లు వేయ‌నున్నారు. ముందుగా ఈ విష‌యంపై అహ్మ‌దాబాద్ రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అక్క‌డి రైల్వే పోలీస్ అధికారులు హెచ్చ‌రించారు. సెల్ఫీలో ట్రాక్ కనిపిస్తే 147వ సెక్ష‌న్‌, ట్రాక్‌తో పాటు ట్రైన్ కూడా క‌న‌బ‌డితే 145, 147 సెక్ష‌న్ల ప్ర‌కారం కేసులు న‌మోదు చేయ‌నున్నామ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

క‌దులుతున్న రైల్లోనూ, వెనుక గూడ్సు రైలు క‌న‌బ‌డుతున్న‌ట్టుగానూ సెల్ఫీలు దిగినా శిక్షార్హ‌మేన‌ని వెల్ల‌డించారు. ఇక రైలు దూసుకువ‌స్తున్న‌పుడు…అది క‌నిపించేలా సెల్ఫీలు దిగితే…వారిపై 153వ సెక్ష‌న్ ప్ర‌కారం కేసులు న‌మోదు చేస్తార‌ని…వారికి ఐదేళ్లు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని రైల్వే వ‌ర్గాలు వెల్ల‌డించాయి. తాజాగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలోనూ ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. సికింద‌రాబాద్‌, హైద‌రాబాద్‌, కాచిగూడ‌, కాజీపేట‌, వ‌రంగ‌ల్ జంక్ష‌న్ త‌దిత‌ర రైల్వే స్టేష‌న్ల‌లోకూడా నిఘా పెంచుతూ, సెల్ఫీలు తీసుకున్న‌వారిపై క‌ఠిన చ‌ట్టాల‌ను అమ‌లు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

First Published:  14 Aug 2016 9:38 PM GMT
Next Story