Telugu Global
National

యూపీలో బాబాయి-అబ్బాయిల మ‌ధ్య గొడ‌వ‌ ఎటు దారితీస్తుంది?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బాబాయి-అబ్బాయిల మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ ఎటు దారితీస్తుంద‌నే ఆందోళ‌న స‌మాజ్‌వాదీ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 2017లో యూపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. స‌మాజ్‌వాదీ పార్టీలో క్వామీ ఏక్తాద‌ళ్ పార్టీని విలీనం చేసేందుకు సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని ఎస్పీలో కీల‌క పాత్ర నిర్వ‌హిస్తున్న ములాయం సింగ్ సోద‌రుడు శివ‌పాల్ సింగ్ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఆయ‌న ఎస్పీ పార్టీకి అధికార ప్ర‌తినిధిగా కూడా ప‌ని చేస్తున్నారు. అయితే ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ ఈ ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకించారు. అయితే త‌న […]

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బాబాయి-అబ్బాయిల మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ ఎటు దారితీస్తుంద‌నే ఆందోళ‌న స‌మాజ్‌వాదీ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 2017లో యూపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. స‌మాజ్‌వాదీ పార్టీలో క్వామీ ఏక్తాద‌ళ్ పార్టీని విలీనం చేసేందుకు సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని ఎస్పీలో కీల‌క పాత్ర నిర్వ‌హిస్తున్న ములాయం సింగ్ సోద‌రుడు శివ‌పాల్ సింగ్ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు.
ఆయ‌న ఎస్పీ పార్టీకి అధికార ప్ర‌తినిధిగా కూడా ప‌ని చేస్తున్నారు. అయితే ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ ఈ ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకించారు. అయితే త‌న అన్న కుమారుడు అఖిలేష్ వైఖ‌రితో శివ‌పాల్ యాద‌వ్ కంగుతిన్నారు. అప్ప‌టినుంచి బాబాయి శివ‌పాల్ యాద‌వ్‌, సీఎం అఖిలేష్ యాద‌వ్‌ల మ‌ధ్య సంబంధాలు క్షీణించాయి. ఇటీవ‌ల శివ‌పాల్ యాద‌వ్ రాజీనామాతో ఆ రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. యూపీలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని ఆరోపిస్తూ శివ‌పాల్ యాద‌వ్ రాజీనామా చేశారు. దీంతో బాబాయి-అబ్బాయిల మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఇదిలా ఉండ‌గా త‌న త‌మ్ముడు శివ‌పాల్ యాద‌వ్‌కే త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. దీంతో అఖిలేష్ కంటే త‌న త‌మ్ముడు శివపాల్ యాద‌వ్‌పైనే ములాయంకు ఎక్కువ మ‌క్కువ ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.
ఇటీవ‌ల జ‌రిగిన ఒక స‌మావేశంలో ములాయం మాట్లాడుతూ త‌న త‌మ్ముడు శివ‌పాల్ యాద‌వ్‌కే త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో సీఎంగా అఖిలేష్ యాద‌వ్‌, ఆయ‌న తండ్రి ములాయంల మ‌ధ్య కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయ‌నే విష‌యం అర్థ‌మ‌వుతున్న‌ది. స‌మాజ్‌వాదీ పార్టీలో ఒక వేళ చీలిక వ‌స్తే స‌గం కంటే ఎక్కువ మంది శివ‌పాల్ వెంట వెళ‌తార‌ని కూడా ములాయం ప్ర‌క‌టించారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో స‌మాజ్‌వాదీ పార్టీలో క్వామీ ఏక్తాద‌ళ్ విలీన అవ‌కాశాలు మెరుగ‌య్యాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.
First Published:  16 Aug 2016 6:00 AM GMT
Next Story