Telugu Global
CRIME

గ‌న్‌తో పిల్లాడి ఆట‌...వృద్ధుడి మెడ‌లో దిగిన తూట‌!

పిల్ల‌ల‌కు ఆడుకోవ‌డానికి ఎవ‌రైనా బొమ్మ తుపాకులు కొనిస్తుంటారు. కానీ బెంగ‌లూరుకి చెందిన బిజెపి నాయ‌కుడు, సెన్సార్ బోర్డు స‌భ్యుడు అయిన  కె. మునిరాజు ఇంట్లో…. ఆయ‌న మ‌నుమ‌డు ఏకంగా లైసెన్సు ఉన్న .32 రివాల్వ‌ర్‌తోనే ఆడుకోవ‌టం మొద‌లుపెట్టాడు. పిల్లాడి చేతుల్లో ఆ తుపాకి పేలి మునిరాజుని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన గోవింద‌ప్ప (66) అనే పెద్ద‌మ‌నిషి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మునిరాజు ఆ రోజు స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు…రివాల్వ‌ర్‌ని తీసుకుని వెళ్లారు. ఆయ‌న ఇంటికి వ‌చ్చాక దాన్ని టీ స్టాండులో […]

గ‌న్‌తో పిల్లాడి ఆట‌...వృద్ధుడి మెడ‌లో దిగిన తూట‌!
X

పిల్ల‌ల‌కు ఆడుకోవ‌డానికి ఎవ‌రైనా బొమ్మ తుపాకులు కొనిస్తుంటారు. కానీ బెంగ‌లూరుకి చెందిన బిజెపి నాయ‌కుడు, సెన్సార్ బోర్డు స‌భ్యుడు అయిన కె. మునిరాజు ఇంట్లో…. ఆయ‌న మ‌నుమ‌డు ఏకంగా లైసెన్సు ఉన్న .32 రివాల్వ‌ర్‌తోనే ఆడుకోవ‌టం మొద‌లుపెట్టాడు. పిల్లాడి చేతుల్లో ఆ తుపాకి పేలి మునిరాజుని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన గోవింద‌ప్ప (66) అనే పెద్ద‌మ‌నిషి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మునిరాజు ఆ రోజు స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు…రివాల్వ‌ర్‌ని తీసుకుని వెళ్లారు. ఆయ‌న ఇంటికి వ‌చ్చాక దాన్ని టీ స్టాండులో ఉంచి వాష్‌రూముకి వెళ్లారు. ఆయ‌న వాష్‌రూములో ఉండ‌గానే తుపాకి పేలిన శ‌బ్దం వ‌చ్చింది.

ప‌రుగెత్తుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చి చూసే స‌రికి గోవింద‌ప్ప ఇంటి వ‌రండాలో కూర్చుని ఉన్నారు. ఆయ‌న ఎదురుగా త‌న మూడున్న‌రేళ్ల మ‌నుమ‌డు ఉన్నాడు. గోవింద‌ప్ప మెడ‌నుండి ర‌క్తం కారుతోంది. మ‌నుమ‌డు త‌న తుపాకి తీసుకుని ఆడాడ‌ని, అది మిస్ ఫైర్ అయ్యింద‌ని మునిరాజు మీడియాకు వివ‌రించారు. ఏం జ‌రిగిందో అర్ధ‌మ‌య్యే స‌రికి త‌న‌కు కొన్ని నిముషాలు ప‌ట్టింద‌ని మునిరాజు చెప్పారు.

మునిరాజు మూడంత‌స్తుల బంగ‌ళాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బాలుడు తుపాకిని కిందకి విసిరికొట్ట‌గా అది మిస్‌ఫైర్ అయి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న సిసిటివి కెమెరాలో ఈ సంఘ‌ట‌న రికార్డ‌యింది. గోవింద‌ప్ప ఇస్రోలో పనిచేసి రిటైర‌య్యారు. ఆయ‌న‌కు బుల్లెట్ గాయం చేసిన బుడ‌త‌డు…న‌ర్స‌రీ స్కూలుకి వెళుతున్నాడు. స్కూలుకి సెల‌వులు కావ‌టంతో తాత‌గారి ఇంటికి వ‌చ్చాడు.

Click on Image to Read:

babu murder case

ysrcp leader

ias sri lakshmi

mohan babu

ap bc sangam president uday bhaskar

madhu yashki

Renuka Shahane Irom Sharmila

kodandaram

nayeem

vehicle registrations

dr samaram

Dalit Mahasammelan at Una 1

jc diwakar reddy

soundarya 1

Aadi Chuttalabbai

pushkaragat 1

First Published:  16 Aug 2016 2:00 AM GMT
Next Story