Telugu Global
NEWS

నయీంతో లింకులు లేవు, ఇదంతా బైరెడ్డి కుట్ర " శివానందరెడ్డి

గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధాలున్న వ్యక్తుల్లో తాను కూడా ఉన్నానంటూ ఒక మీడియా ఛానల్‌ కథనం ప్రసారం చేయడంపై రిటైర్డ్ పోలీస్ అధికారి శివానందరెడ్డి స్పందించారు. ఇలాంటి అబద్దాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఒక ఛానల్‌ మాత్రమే తన పేరు ప్రచురించడం వెనుక రాజకీయకుట్ర ఉందని శివానందరెడ్డి ఆరోపించారు. ఈ తప్పుడు కథనాల ప్రసారం వెనుక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హస్తముండవచ్చని శివానందరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి కాంగ్రెస్‌లో ఉండేవారని… నందికొట్కూరు ప్రాంతానికే చెందిన […]

నయీంతో లింకులు లేవు, ఇదంతా బైరెడ్డి కుట్ర  శివానందరెడ్డి
X

గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధాలున్న వ్యక్తుల్లో తాను కూడా ఉన్నానంటూ ఒక మీడియా ఛానల్‌ కథనం ప్రసారం చేయడంపై రిటైర్డ్ పోలీస్ అధికారి శివానందరెడ్డి స్పందించారు. ఇలాంటి అబద్దాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఒక ఛానల్‌ మాత్రమే తన పేరు ప్రచురించడం వెనుక రాజకీయకుట్ర ఉందని శివానందరెడ్డి ఆరోపించారు. ఈ తప్పుడు కథనాల ప్రసారం వెనుక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హస్తముండవచ్చని శివానందరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి కాంగ్రెస్‌లో ఉండేవారని… నందికొట్కూరు ప్రాంతానికే చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో రాజకీయ విబేధాలున్నాయని దాన్ని మనసులో పెట్టుకుని సదరు ఛానల్‌కు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డే తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు శివానందరెడ్డి.

అసలు తాను 2009లోనే రిటైర్ అయ్యానని అప్పటికి నయీం గురించి ఎవరకీ పెద్దగా తెలియదన్నారు. నల్లగొండలో తాను అదనపు ఎస్పీగా పనిచేసినప్పటికీ తాను ఆపరేషన్‌ చూసే వాడిని కాదని కేవలం పరిపాలన విభాగాన్ని పర్యవేక్షించేవాడినని చెప్పారు. అసలు నయీం గురించి తనకు తెలియదన్నారు. నయీంతో సంబంధం లేని వారి పేర్లు ప్రచారం చేయడం వల్ల… భవిష్యత్తులో అసలు నిందితుల పేర్లు బయటపెట్టినా జనం నమ్మే పరిస్థితి ఉండదన్నారు. పక్కా సమాచారం ఉంటే కథనాలు రాసుకోవాలని అలా కాకుండా ఎవరో ఏదో చెబితే వివరణ కూడా తీసుకోకుండా కథనాలు రాయడం మీడియాకు కూడా మంచిది కాదని శివానందరెడ్డి సూచించారు.

Click on Image to Read:

rama subba reddy vs adinarayana reddy

ysrcp

chandrababu sakshi

bharathi singh v k singh

chandrababu naidu

abk prasad

si ramakrishna reddy

cbn

Uma Madhava Reddy 1

komati-reddy-rajagopal-redd

ysrcp leader

babu murder case

mohan babu

payyavula keshav

ias sri lakshmi

ap bc sangam president uday bhaskar

madhu yashki

heart attack

First Published:  17 Aug 2016 4:40 AM GMT
Next Story