Telugu Global
Cinema & Entertainment

జ‌న‌తా గ్యారేజ్ సెట్ లో   కాజ‌ల్ హ‌ల్ చ‌ల్‌...!

ఎన్టీఆర్  తో బృందావ‌నం..  బాద్ షా, టెంప‌ర్‌ చిత్రాలు  చేసిన కాజ‌ల్  అంటే  హీరోస్ కు  ఒక పాజిటివ్  కార్న‌ర్ ఉంది. ఇండ‌స్ట్రీలో   స‌క్సెస్  లో వున్న  వారి ప‌ట్ల పాజిటివ్  సెంటిమెంట్ అప్లై అవుతుండ‌టం  స‌హజం.  అదే  ఫెయిల్యూర్ లో  వుంటే ఆమ‌డ దూరంలో పెడ‌తారు.   ఎందుకు అంటే  ఎవ‌రి సెంటిమెంట్ వారిది. ఎవ‌రి లాజిక్ వారికుంటుంది. కట్ చేస్తే..  కాజ‌ల్ ఎన్టీఆర్ తో చేసిన మూడు  చిత్రాలు ..  బ్లాక్ బ‌స్ట‌ర్స్ కాక పోయినా..  […]

జ‌న‌తా గ్యారేజ్ సెట్ లో   కాజ‌ల్ హ‌ల్ చ‌ల్‌...!
X

ఎన్టీఆర్ తో బృందావ‌నం.. బాద్ షా, టెంప‌ర్‌ చిత్రాలు చేసిన కాజ‌ల్ అంటే హీరోస్ కు ఒక పాజిటివ్ కార్న‌ర్ ఉంది. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ లో వున్న వారి ప‌ట్ల పాజిటివ్ సెంటిమెంట్ అప్లై అవుతుండ‌టం స‌హజం. అదే ఫెయిల్యూర్ లో వుంటే ఆమ‌డ దూరంలో పెడ‌తారు. ఎందుకు అంటే ఎవ‌రి సెంటిమెంట్ వారిది. ఎవ‌రి లాజిక్ వారికుంటుంది. కట్ చేస్తే.. కాజ‌ల్ ఎన్టీఆర్ తో చేసిన మూడు చిత్రాలు .. బ్లాక్ బ‌స్ట‌ర్స్ కాక పోయినా.. ప్లాప్ మాత్రం కాలేదు. దీంతో ఎన్టీఆర్ కు కాజ‌ల్ అంటే స‌క్సెస్ సెంటిమెంట్ అని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు.

తాజాగా కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న జ‌న‌తా గ్యారేజ్ చిత్రం లో కాజ‌ల్ ఒక స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది. . ఎట్ ప్రజెంట్ ఓ పాటను నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో షూట్ చేస్తున్నారు. ఐదు రోజుల పాటు దీన్ని చిత్రీకరించనున్నారు. భారీ ఖర్చుతో సెట్‌ను రెడీ చేసింది యూనిట్. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ తీర్చిదిద్దిన ఈ సెట్ యూనిట్‌ని ఎట్రాక్ట్ చేసుకుంటోంది. ‘నేను పక్కా లోకల్’ అనే పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిచాడు. ఈ మ‌ధ్య విడుద‌లైన జ‌న‌తా గ్యారేజ్ సినిమా ట్రైల‌ర్ కు యూ ట్యూబ్ లో మంచి స్పంద‌న వ‌స్తుండ‌టంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది.

Click to Read

శ్రుతి హాసన్ గౌతమిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదా? శ్రుతి హాసన్ గౌతమిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదా?

మెడల్స్ ఇస్తే సరిపోదు, డబ్బులివ్వండి – అక్షయ్ మెడల్స్ ఇస్తే సరిపోదు, డబ్బులివ్వండి – అక్షయ్

First Published:  17 Aug 2016 6:27 AM GMT
Next Story