Telugu Global
Cinema & Entertainment

పూరీపై క్లారిటీ ఇచ్చిన ముమైత్

పూరి డైరక్ట్ చేసిన పోకిరి సినిమాతోనే ముమైత్ హవా ప్రారంభమైంది. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే పాట ముమైత్ కెరీర్ ను మార్చేసింది. ఆ తర్వాత ఐటెంసాంగ్స్ కు కేరాఫ్ గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఈ క్రమంలోనే పూరీతో ముమైత్ కి ఎఫైర్ ఉందనే రూమర్లు ఎక్కువగా చక్కర్లు కొట్టాయి.  ఈ పుకార్లను మొన్నటివరకు లైట్ తీసుకుంది ముమైత్. కానీ తాజాగా అదేపనిగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు పూరీ […]

పూరీపై క్లారిటీ ఇచ్చిన ముమైత్
X

పూరి డైరక్ట్ చేసిన పోకిరి సినిమాతోనే ముమైత్ హవా ప్రారంభమైంది. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే పాట ముమైత్ కెరీర్ ను మార్చేసింది. ఆ తర్వాత ఐటెంసాంగ్స్ కు కేరాఫ్ గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఈ క్రమంలోనే పూరీతో ముమైత్ కి ఎఫైర్ ఉందనే రూమర్లు ఎక్కువగా చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లను మొన్నటివరకు లైట్ తీసుకుంది ముమైత్. కానీ తాజాగా అదేపనిగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో తనకు ఎఫైర్ ఉందంటూ వచ్చే వార్తల్లో నిజం లేదని అంటోంది ముమైత్. పోకిరి చేసినప్పటి నుంచీ ఆయనతో మంచి స్నేహం కుదిరిందని, కాస్త క్లోజ్ గా ఉంటే ఇటువంటి ఎఫైర్ వార్తలు రావడం సహజమేనని చెప్పుకొచ్చింది. అయితే, ఇప్పటివరకు ఈ రూమర్స్ ను పెద్దగా పట్టించుకోలేదని, ఇలా ప్రచారం జరిగినప్పుడల్లా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలా చేస్తే టైమ్ వేస్ట్ తప్ప ఉపయోగమేమీ ఉండదని ముమైత్ ఖాన్ అభిప్రాయపడింది. ఈమధ్య కాలంలో ఈ పుకార్లు శృతిమించడంతోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా మెగా హీరో సాయిధరమ్ తేజతో కలిసి ‘తిక్క’ చూపించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గినా కూడా మళ్ళీ తిరిగి సత్తా చాటుతానని గట్టిగా చెబుతోంది.

First Published:  17 Aug 2016 10:33 PM GMT
Next Story