Telugu Global
Cinema & Entertainment

నక్షత్రంలోకి అడుగుపెట్టిన కంచె బ్యూటీ

నక్షత్రం అనే ప్రాజెక్టు ఇప్పటికే స్టార్ కాస్ట్ తో నిండిపోయింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా ఎంపికైంది. చిన్న హీరో తనీష్… విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఓ కీలకమైన పాత్ర కోసం ఇప్పటికే సాయిధర్మతేజ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కంచె హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా నక్షత్రంలో చేరింది. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ కన్ ఫర్మ్ చేశాడు. సినిమాకు మరింత హైప్ తీసుకువస్తూ కృష్ణవంశీ తాజాగా […]

నక్షత్రంలోకి అడుగుపెట్టిన కంచె బ్యూటీ
X

నక్షత్రం అనే ప్రాజెక్టు ఇప్పటికే స్టార్ కాస్ట్ తో నిండిపోయింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా ఎంపికైంది. చిన్న హీరో తనీష్… విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఓ కీలకమైన పాత్ర కోసం ఇప్పటికే సాయిధర్మతేజ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కంచె హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా నక్షత్రంలో చేరింది. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ కన్ ఫర్మ్ చేశాడు.

సినిమాకు మరింత హైప్ తీసుకువస్తూ కృష్ణవంశీ తాజాగా ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ ను రంగంలోకి దించాడు. ఈ విషయాన్ని కృష్ణవంశీ తాజాగా తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా తెలియజేశాడు. ’హరివిల్లు లాంటి అందమైన ‘నక్షత్రం’లో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ మెరవనుంది. ప్రగ్యా జైస్వాల్ ఓ శక్తివంతమైన పోలీస్ పాత్రలో సాయిధరమ్ తేజ్ కు ఆపోజిట్ గా నటించబోతోంది. ముఖ్యంగా ఆమె కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన రెండు ఛాలెంజింగ్ ఫైట్ సీక్వెన్స్ లను తెరకెక్కించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. విశేషంగా అందులో ఓ ఫైట్ హీరో సందీప్ కిషన్ తో ఉండబోతుంది’ అని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వెల్లడించారు. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, తనీష్ లతో నిండిపోయిన నక్షక్రం సినిమాలోకి ఇంకెంతమంది పేరున్న స్టార్లు వచ్చిచేరుతారో చూడాలి.

First Published:  17 Aug 2016 10:32 PM GMT
Next Story