Telugu Global
National

ఫైనల్‌లో ఓడిన సింధు

రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో సింధు ఓడిపోయింది.  తొలినుంచి హోరాహోరీగా పోరాడినప్పటికీ వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ అనుభవం ముందు ఫలితం లేకపోయింది. రజతపతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. అయితే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది. తొలి గేమ్ లో ఓ దశలో మారిన్ […]

ఫైనల్‌లో ఓడిన సింధు
X

రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో సింధు ఓడిపోయింది. తొలినుంచి హోరాహోరీగా పోరాడినప్పటికీ వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ అనుభవం ముందు ఫలితం లేకపోయింది. రజతపతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. అయితే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది.

తొలి గేమ్ లో ఓ దశలో మారిన్ 12-6తో ముందంజ వేసింది. ఈ సమయంలో సింధు విజృంభించి వరుసగా మూడు పాయింట్లు సాధించింది. తర్వాత ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. సింధు స్కోరును 19-19తో సమంచేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ సమయంలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ నుంచి మాత్రం మారిన్ చెలరేగిపోయింది. సింధు గట్టి పోటీ ఇస్తున్నా స్కోర్ పట్టికలో మారిన్‌దే పైచేయిగా నిలుస్తూ వచ్చింది.

First Published:  19 Aug 2016 11:01 AM GMT
Next Story