Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ కొత్త సినిమాలో మనోజ్

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ సినిమా గురించి కాదు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత చెర్రీ చేయబోయే సుకుమార్ సినిమా గురించి. అవును… ఈ సినిమాలోకి లేటెస్ట్ గా మనోజ్ చేరాడు. మనోజ్ అంటే మంచు మనోజ్ కాదు. కెమెరామెన్ మనోజ్ పరమహంస. ఏమాయచేశావె, రేసుగుర్రం, బ్రూస్ లీ లాంటి సినిమాలతో ఇప్పటికే తన టాలెంట్ ఏంటో చూపించుకున్నాడు మనోజ్. […]

రామ్ చరణ్ కొత్త సినిమాలో మనోజ్
X

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ సినిమా గురించి కాదు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత చెర్రీ చేయబోయే సుకుమార్ సినిమా గురించి. అవును… ఈ సినిమాలోకి లేటెస్ట్ గా మనోజ్ చేరాడు. మనోజ్ అంటే మంచు మనోజ్ కాదు. కెమెరామెన్ మనోజ్ పరమహంస. ఏమాయచేశావె, రేసుగుర్రం, బ్రూస్ లీ లాంటి సినిమాలతో ఇప్పటికే తన టాలెంట్ ఏంటో చూపించుకున్నాడు మనోజ్. అందుకే ఈ కుర్రాడికి మరోసారి అవకాశం ఇచ్చాడు చెర్రీ. అటు సుకుమార్ కు కూడా మనోజ్ వర్కింగ్ స్టయిల్ అంటే చాలా ఇష్టం.

మరోవైపు చెర్రీ-సుక్కూ సినిమాలో హీరోయిన్ గురించి వేట జోరుగా సాగుతోంది. హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకుందామంటే… ఇప్పటికే బ్రూస్ లీతో పాటు ధ్రువ సినిమా కూడా చేస్తోంది. మళ్లీ వరుసగా మూడోసారి చెర్రీ సరసన అంటే బాగుండదు. అటు కాజల్ కూడా చెర్రీ పక్కన రొటీన్ అయిపోయింది. పోనీ సమంతను తీసుకుందామంటే ఆమె సినిమాలు తగ్గించేసింది. అందుకే చెర్రీ కోసం ఓ కొత్తమ్మాయిని వెదికే పనిలో పడ్డాడు సుకుమార్.

First Published:  20 Aug 2016 6:52 AM GMT
Next Story