మంచి మ‌గాళ్ల‌ను నమ్ముకుంటున్న దీపిక ప‌దుకోణ్‌…

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ‘xXx-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ‘ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కేవలం దీపిక ముఖంతో ఈ పోస్టర్ రిలీజ్ చేసారు. ‘మంచి మగాళ్ల మీద తనకు నమ్మకం లేదు’ అని దీపిక అభిప్రాయ పడ్డట్లు ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ బట్టి సినిమాలో దీపిక పదుకోన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

పోస్టర్ కూడా డిఫరెంటుగా ఉంది. బాలీవుడ్లో తన సెక్సీ అందాలతో అదరగొట్టిన దీపిక హాలీవుడ్ మూవీ పోస్టర్ మరింత సెక్సీగా ఉంటుందని అంతా భావించారు. కానీ దీపికను నేరుగా చూపించకుండా ఆమె బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ తో పోస్టర్ డిజైన్ చేసారు. ఈ సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. ఈ సినిమాకు డీజే కరుసో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక-విన్ డీజిల్ తో పాటు టోనీ జా.. శామ్యూల్ జాక్సన్.. టోనీ కోలెట్.. నినా డొబ్రెవ్.. రూబీ రోజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Click to Read

నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్ నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్

         బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం