Telugu Global
NEWS

మాగంటి గోపీనాథ్ తిరిగి సైకిలెక్కుతారా?

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళతారా? ఇటీవ‌లే క‌దా ఆయ‌న టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి వెళ్లింది. ఇంతలో ఏమైంది.. అస‌లు ఈ ప్ర‌చారం ఎందుకు మొద‌లైంది అనే క‌దా మీ అనుమానాలు. అక్క‌డికే వ‌స్తున్నాం.. న‌గ‌రంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆర్‌.క్రిష్ణ‌య్య మిన‌హా అంతా కారెక్కేశారు.  అంద‌రి సంగ‌తి ఎలా ఉన్నా.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేర‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. […]

మాగంటి గోపీనాథ్ తిరిగి సైకిలెక్కుతారా?
X
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళతారా? ఇటీవ‌లే క‌దా ఆయ‌న టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి వెళ్లింది. ఇంతలో ఏమైంది.. అస‌లు ఈ ప్ర‌చారం ఎందుకు మొద‌లైంది అనే క‌దా మీ అనుమానాలు. అక్క‌డికే వ‌స్తున్నాం.. న‌గ‌రంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆర్‌.క్రిష్ణ‌య్య మిన‌హా అంతా కారెక్కేశారు. అంద‌రి సంగ‌తి ఎలా ఉన్నా.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేర‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. చంద్ర‌బాబుకు చాలా ద‌గ్గ‌రి వ్య‌క్తిగా పేరొందిన ఈయ‌న కారెక్క‌డం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేసింది. అయితే, ఆయ‌న ఇక్క‌డి ప‌రిస్థితి మొత్తం బాబుకు వివ‌రించాకే.. పార్టీ మారార‌న్న ప్ర‌చారమూ ఉంది. ఆ త‌రువాత‌.. తెలుగుదేశం శాస‌న‌స‌భా ప‌క్షం మొత్తం టీఆర్ ఎస్‌లో విలీన‌మైంది. అప్ప‌టి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల విష‌యంలో ఎలాంటి అల‌జ‌డి లేదు. కానీ, ఇప్పుడు మొద‌లైంది.
మాగంటి గోపీనాథ్ కుడిభుజంగా చెప్పుకునే ప్ర‌దీప్ చౌద‌రీ ఆదివారం తిరిగి తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ ట్ర‌స్టుభ‌వ‌న్లో తెలుగుదేశం తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన సంద‌ర్భంగా ప్ర‌దీప్ చౌద‌రి విలేక‌రుల‌తో మాట్లాడారు. టీఆర్ ఎస్‌లో టీడీపీ నుంచి వ‌చ్చిన వారిని లెక్క చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. మంత్రుల‌కైనా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ దొర‌క‌డం లేద‌ని ఆరోపించారు. టీడీపీ నేత‌ల‌పై చూపుతున్న వివ‌క్ష కార‌ణంగానే.. తాను తిరిగి సొంత గూటికి వ‌చ్చాన‌ని తెలిపారు. దీంతో మాగంటి గోపీనాథ్ కూడా మాతృపార్టీలో చేర‌తారా? అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఆయ‌న టీడీపీలో చేరే ప్ర‌ణాళిక‌లో భాగంగానే.. ముందు జాగ్ర‌త్తగా త‌న కుడిభుజ‌మైన ప్ర‌దీప్ చౌద‌రిని పాత పార్టీకి పంపారా? అని ప‌లువురు సందేహిస్తున్నారు.
First Published:  21 Aug 2016 11:16 PM GMT
Next Story