Telugu Global
Cinema & Entertainment

ఇకపై ఒకేసారి రెండు సినిమాలు

రవితేజ ఒక్కసారిగా గ్యాప్ ఇచ్చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే మాస్ రాజా… బెంగాల్ టైగర్ తర్వాత ఒక్క సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. రాబిన్ హుడ్ దాదాపు కన్ ఫర్మ్ అయిపోయిందనుకున్న టైమ్ లో ఆ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకున్నాడు. ఈమధ్యే విదేశీ పర్యటన పూర్తిచేసుకొచ్చిన రవితేజ, ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. వీటిలో బాబి దర్శకత్వంలో సినిమాను ఇప్పటికే ఓకే చేశాడు. గతంలో బాబి-రవితేజ కాంబినేషన్ […]

ఇకపై ఒకేసారి రెండు సినిమాలు
X

రవితేజ ఒక్కసారిగా గ్యాప్ ఇచ్చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే మాస్ రాజా… బెంగాల్ టైగర్ తర్వాత ఒక్క సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. రాబిన్ హుడ్ దాదాపు కన్ ఫర్మ్ అయిపోయిందనుకున్న టైమ్ లో ఆ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకున్నాడు. ఈమధ్యే విదేశీ పర్యటన పూర్తిచేసుకొచ్చిన రవితేజ, ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. వీటిలో బాబి దర్శకత్వంలో సినిమాను ఇప్పటికే ఓకే చేశాడు.

గతంలో బాబి-రవితేజ కాంబినేషన్ లో పవర్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. తర్వాత పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేశాడు బాబి. కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో మరోసారి మాస్ రాజాతో కలిసి లక్ చెక్ చేసుకోవాలని బాబి నిర్ణయించుకున్నాడు. తను చెప్పిన కథకు రవితేజ ఒప్పుకున్నాడని తెలిపిన బాబి, వచ్చేనెలలో సినిమా ప్రారంభమౌతుందని ప్రకటించాడు. చుట్టాలబ్బాయ్ సినిమాను నిర్మించిన రామ్ తాళ్లూరి…. రవితేజ-బాబి ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే గ్యాప్ ను భర్తీ చేసేందుకు మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని రవితేజ భావిస్తున్నాడు. ఆ సినిమా ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  22 Aug 2016 4:20 AM GMT
Next Story