Telugu Global
Cinema & Entertainment

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సల్మాన్

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 50ఏళ్ల వయసులో ఉన్నాడు. అయినప్పటికీ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్నాడు. 50ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా… అసలు తనకు సెక్స్ అంటే ఏంటో తెలియదని బుకాయిస్తూ గడిపేస్తున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఇకపై సల్మాన్ ఎంతమాత్రం బ్రహ్మచారి కాదని తేల్చిచెప్పేసింది ఓ పత్రిక. అది కూడా భారతీయ పత్రిక కాదు. ఓ రొమేనియా పత్రిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆధారాలుగా కొన్ని ఫొటోలు కూడా ప్రచురించింది. సల్మాన్ ఖాన్ […]

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సల్మాన్
X

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 50ఏళ్ల వయసులో ఉన్నాడు. అయినప్పటికీ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్నాడు. 50ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా… అసలు తనకు సెక్స్ అంటే ఏంటో తెలియదని బుకాయిస్తూ గడిపేస్తున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఇకపై సల్మాన్ ఎంతమాత్రం బ్రహ్మచారి కాదని తేల్చిచెప్పేసింది ఓ పత్రిక. అది కూడా భారతీయ పత్రిక కాదు. ఓ రొమేనియా పత్రిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆధారాలుగా కొన్ని ఫొటోలు కూడా ప్రచురించింది.

సల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా రొమేనియాకు చెందిన మోడల్, టీవీ ఆర్టిస్ట్ లులియా వుంటర్ తో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆమెనే సల్మాన్ పెళ్లి చేసుకుంటాడని అంతా ఊహిస్తున్నారు. ఇంతలోనే లులియా అందరికీ షాక్ ఇచ్చింది. ఓ రొమేనియన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను తాను మిసెస్ లులియా ఖాన్ గా పరిచయం చేసుకుంది. దీంతో అంతా అవాక్కయ్యారు. స్వయంగా లులియానే ప్రకటించడంతో… సల్మాన్-లులియా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్త గుప్పుమంది. అయితే దీనిపై సల్మాన్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

Click to Read

బాహుబలి-2 చాలా చిన్నదంట… బాహుబలి-2 చాలా చిన్నదంట…

మంచి మ‌గాళ్ల‌ను న‌మ్మ‌నంటున్న దీపిక ప‌దుకోణ్‌… మంచి మ‌గాళ్ల‌ను న‌మ్మ‌నంటున్న దీపిక ప‌దుకోణ్‌…

నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్ నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్

బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం

First Published:  21 Aug 2016 11:19 PM GMT
Next Story