Telugu Global
Cinema & Entertainment

రచ్చ చేయడానికి గోపీచంద్ రెడీ

సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చేయడానికి గోపీచంద్ రెడీ అయిపోయాడు. అవును.. గోపీచంద్-సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. ఈ ప్రారంభోత్సవానికి పవన్ ఫ్రెండ్, నిర్మాత శరత్ మరార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ముహుర్తం షాట్ కు కెమెరా స్విచాన్ చేశాడు. హీరోయిన్ క్యాథరీన్ కూడా ఈ ఫంక్షన్ కు హాజరైంది. మరో హీరోయిన్ హన్సిక నేరుగా సెట్స్ పైకి వచ్చేస్తుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ […]

రచ్చ చేయడానికి గోపీచంద్ రెడీ
X

సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చేయడానికి గోపీచంద్ రెడీ అయిపోయాడు. అవును.. గోపీచంద్-సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. ఈ ప్రారంభోత్సవానికి పవన్ ఫ్రెండ్, నిర్మాత శరత్ మరార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ముహుర్తం షాట్ కు కెమెరా స్విచాన్ చేశాడు. హీరోయిన్ క్యాథరీన్ కూడా ఈ ఫంక్షన్ కు హాజరైంది. మరో హీరోయిన్ హన్సిక నేరుగా సెట్స్ పైకి వచ్చేస్తుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ బాలాజీ సినీమీడియా బ్యానర్ పై జే.పుల్లారావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. తమన్ సంగీత దర్శకత్వం వహించబోతున్నాడు. గోపీచంద్ సినిమాకు సంగీతం అందించనుండడం తమన్ కు ఇదే తొలిసారి కాగా… అటు క్యాథరీన్-హన్సికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం కూడా గోపీచంద్ కు ఇదే ఫస్ట్ టైం. సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగినప్పటికీ… రెగ్యులర్ షూటింగ్ విశేషాల్ని మాత్రం చిత్ర యూనిట్ బయటపెట్టలేదు. ప్రస్తుతం గోపీచంద్ ఆక్సిజన్ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్తాడు గోపీచంద్. యాక్షన్ ఇమేజ్ తెచ్చుకున్న గోపీచంద్… సౌఖ్యం లాంటి సాఫ్ట్ మూవీస్ లో కూడా నటించి హిట్ అందుకున్నాడు. తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేయబోయే మూవీ మాత్రం పక్కా యాక్షన్ చిత్రంగా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ బయటకు రాబోతున్నాయి.

First Published:  22 Aug 2016 11:57 PM GMT
Next Story