ఆ ఇద్ద‌రు  హీరోల ప‌రిస్థితి  అంతే నా..!

ఇండ‌స్ట్రీలో  బ్యాగ్రౌండ్ వున్న వాళ్లు కొంత వ‌ర‌కు ల‌క్కీ  ఫెలోస్ అని చెప్పాలి. ఎందుకంటే..వాళ్ల‌కు   ఎంట్రీ విష‌యంలో సాలిడ్  ప్లాట్ ఫామ్ వుంటుంది. ఇలా మంచి ఎంట్రీ కొట్టిన వాళ్లలో  అక్కినేని ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన  సుశాంత్..  సాయికుమార్  త‌న‌యుడిగా   ఆది వ‌చ్చారు. కానీ   ఇప్ప‌టి వ‌ర‌కు   ఇద్ద‌రు  చెరో 5 చిత్రాలు చేశారు. ఆది ప్రేమ కావాలి అనే సినిమాతో ప‌రిచ‌యం అయ్యాడు.   ఆ చిత్రంలో ఆదిని చూసి అబ్బాయి డాన్స్ లు బాగా చేస్తున్నాడు  మంచి    హీరో అవుతాడ‌నే టాక్ వినిపించింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు    ఆది  ఒకే త‌ర‌హా  మూస యాక్ష‌న్  తో చంపేస్తున్నాడు. కథ‌ల ఎంపిక  కూడా స‌రిగా ఉండ‌టం లేదు.

ఇక  తెలుగు ఇండ‌స్ట్రీ  లో ఒక దిగ్గ‌జ‌మైన అక్కినేని నాగేశ్వ‌రావు మ‌న‌వ‌డిగా..  నాగార్జున మేన‌ల్లుడిగా  సుశాంత్ ఎంట్రీ జ‌రిగింది. కానీ అబ్బాయి   ఎన‌ర్జీ లెవ‌ల్స్   ఆడియ‌న్స్ కు  క‌నెక్ట్ కావ‌డం లేదు.  యాక్టింగ్ స్కిల్స్  అంతంత మాత్ర‌మే . దీంతో  మ‌నోడు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది.

ఇక తాజాగా  వీరిద్ద‌రు    ఎలాగైన స‌క్సెస్ కొట్టాల‌నే ఊపుతో వ‌చ్చారు. కానీ..   ఇద్ద‌రిలో  చుట్ట‌ల‌బ్బాయిగా  వ‌చ్చిన ఆది కాస్త ప‌ర‌వ‌లేదునిపించుకున్నాడు.  సుశాంత్   ఆటాడుకుందాం రా చిత్రం మాత్రం.. ఆడియ‌న్స్ పేష‌న్స్ తో   ఆటాడుకున్నార‌నే చెప్పాలి. జి నాగేశ్వ‌రెడ్డి  డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ చిత్రం సుశాంత్ లుక్స్ ప‌రంగా ప‌ర‌వాలేదేనిపించుకున్నాడు. కానీ యాక్టింగ్ ప‌రంగా మాత్రం బెట‌ర్ కాలేదు. కామెడి  విష‌యంలో  టైమింగ్  లేదు.  ఎమోష‌న్స్ లో   సెంటిమెంట్స్ పండించ‌డం  కుద‌ర‌నే లేదు.  డైలాగ్ లో ఎన‌ర్జినిల్.   ఇలా చెప్పుకుంటే అత‌ను ఇంప్రూవ్ చేసుకోవాల‌సిన‌వి చాలా ఉన్నాయి.   వాయిస్ ఇంప్రూవైజేష‌న్  కోసం  బాగా వ‌ర్క్ చేయాలి. ఇలా మొత్తం మీద‌…  మంచి హిట్స్ కొట్టి మార్కెట్ పరంగా  కాస్తా రెమ్యున్ రేష‌న్  పెంచుదామ‌ని ఆశ‌ప‌డ్డ   ఆది అండ్ సాయికుమార్ డ్రీమ్ నేర‌వేర‌క పోక సీన్ రివ‌ర్స్ అయ్యింది.   

కొత్త క‌థ‌ల‌కు..కొత్త  ద‌ర్శ‌కుల‌కు  అవ‌కాశం ఇచ్చి..  త‌క్కువ బ‌డ్జెట్ లో   మంచి క్వాలిటి ఫిల్మ్స్ చేసుకుంటే  త‌ప్ప‌…   హీరోలుగా నిల‌బ‌డ‌టం అంత తేలిక కాదు.! ఎందుకంటే ఇండ‌స్ట్రీకి స‌క్సెస్ ముఖ్యం.   స‌క్సెస్ చుట్టే స‌మ‌స్తం తిరుగుతుంది. అది లేక పోతే  ఏమి ఉండ‌దు.  ఎవ‌రు ప‌ట్టించుకోరు అనే విష‌యం   అంద‌రికి తెలిసిందే.