Telugu Global
Cinema & Entertainment

ఒక ఐట‌మ్ సాంగ్ కు 2 కోట్లు ...!

నిఖిల్‌ కుమార్‌ హీరోగా హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ బ్యానర్‌పై ఎ.మహాదేవ్‌ దర్శకత్వంలో అనితా కుమారస్వామి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘జాగ్వార్‌’. ఈ నిఖిల్ కుమార్ ఎవరో కాదు… మాజీ ప్రధాని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ మనవడు, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు. 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ కుమార్ తండ్రే నిర్మాత కావడంతో ఖర్చుకు […]

ఒక ఐట‌మ్ సాంగ్ కు 2 కోట్లు ...!
X

నిఖిల్‌ కుమార్‌ హీరోగా హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ బ్యానర్‌పై ఎ.మహాదేవ్‌ దర్శకత్వంలో అనితా కుమారస్వామి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘జాగ్వార్‌’. ఈ నిఖిల్ కుమార్ ఎవరో కాదు… మాజీ ప్రధాని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ మనవడు, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు. 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ కుమార్ తండ్రే నిర్మాత కావడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు.

ఆ మధ్య టీజర్ రిలీజ్ కార్యక్రమం కూడా హైదరాబాద్ లో ప్రముఖుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమా తెరకెక్కుతోంది కన్నడలోనే అయినా… తెలుగు మార్కెట్ మీద బాగా ఫోకస్ పెట్టారు. అందుకే సెప్టెంబర్ 18న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్ ప్లాన్ చేసారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

శృతి హాసన్ తో ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసేందుకు శృతి హాసన్ ను సంప్రదించినట్లు సమాచారం. ఇందుకోసం ఆమెకు రూ. 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. మొత్తం మీద డ‌బ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేయ‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తుంది.

First Published:  24 Aug 2016 12:09 PM GMT
Next Story