నా స్నేహితుడిని అరెస్టు చేస్తారా...ప్రధాని మోడీ తమ్ముడి అసహనం!
ప్రధాని నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ హఠాత్తుగా వార్తల్లోకి వచ్చారు. ఇండోర్‌లో తన స్నేహితుడైన ఓ దాబా యజమానిపై పోలీసులు కేసు నమోదు చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇండోర్ డిఐజిని కలిసిన ప్రహ్లాద్ మోడీ… జరిగినదానిపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాబా యజమాని అనిల్ రాథోర్‌తో పాటు మరో ఆరుగురిపై పోలీసులు ఎస్సి ఎస్టి వేధింపుల కేసుని నమోదు చేశారు. వారిపై రాథేశ్యాం భిల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాథోర్ […]
ప్రధాని నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ హఠాత్తుగా వార్తల్లోకి వచ్చారు. ఇండోర్‌లో తన స్నేహితుడైన ఓ దాబా యజమానిపై పోలీసులు కేసు నమోదు చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇండోర్ డిఐజిని కలిసిన ప్రహ్లాద్ మోడీ… జరిగినదానిపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాబా యజమాని అనిల్ రాథోర్‌తో పాటు మరో ఆరుగురిపై పోలీసులు ఎస్సి ఎస్టి వేధింపుల కేసుని నమోదు చేశారు. వారిపై రాథేశ్యాం భిల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాథోర్ తప్పించుకోగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాథోర్కోసం పోలీసులు అతని ఇంటిని గాలించినట్టుగా తెలుస్తోంది.
ప్రహ్లాద్ మోడీ ఇండోర్‌లో రాథోర్ ఇంట్లో జరుగుతున్న వివాహానికి హాజరు అయినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే బుధవారం ప్రహ్లాద్ మోడీ…ఇండోర్ డిఐజిని కలిసి రాథోర్మీద పోలీసులు కేసు నమోదు చేయటంపై తీవ్రమైన అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు డిఐజి కార్యాలయం నిర్దారించింది. డిఐజి ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుంటానని హామీ ఇచ్చినట్టుగా సమాచారం.
రాధేశ్యాం ఇచ్చిన ఫిర్యాదుని బట్టి అనిల్ రాథోర్, రాథేశ్యాం బిల్‌ని… పంచర్ అయిన తన కారు టైరుని బాగుచేయమని కోరాడు. అందుకు రాథేశ్యాం ఒప్పుకోకపోవటంతో వారిమధ్య గొడవ మొదలైంది. అనిల్ రాథోర్ తన మనుషులతో కలిసి రాథేశ్యాంని బాగా కొట్టాడు. అంతే కాదు తన ఇంట్లోని మహిళల పట్ల కూడా రాథోర్ బృందం అసభ్యంగా ప్రవర్తించినట్టుగా రాథేశ్యాం కేసు పెట్టాడు.
Click on Image to Read: