Telugu Global
Cinema & Entertainment

హైప‌ర్ హంగామా...

హుషారు కు మారు పేరు యువ హీరో రామ్. త‌నకి మాత్రమే స్పెష‌ల్ అనిపించేలా  చేయ‌డంలో  రామ్  ది ఒక ప్ర‌త్యేక‌త‌. ఈ యేడాది నేను శైల‌జా చిత్రంతో హిట్ అందుకున్న రామ్..లెటెస్ట్ గా   హైప‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు.  రాసి ఖ‌న్నా   హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని  సంతోష్ శ్రీ‌నివాస్ చేస్తున్నాడు. గ‌తంలో  రామ్ తో  కందిరిగ అనే చిత్రం   ఈ ద‌ర్శ‌కుడు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా వీరిద్ద‌రి […]

హైప‌ర్ హంగామా...
X
హుషారు కు మారు పేరు యువ హీరో రామ్. త‌నకి మాత్రమే స్పెష‌ల్ అనిపించేలా చేయ‌డంలో రామ్ ది ఒక ప్ర‌త్యేక‌త‌. ఈ యేడాది నేను శైల‌జా చిత్రంతో హిట్ అందుకున్న రామ్..లెటెస్ట్ గా హైప‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. రాసి ఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సంతోష్ శ్రీ‌నివాస్ చేస్తున్నాడు. గ‌తంలో రామ్ తో కందిరిగ అనే చిత్రం ఈ ద‌ర్శ‌కుడు చేసిన విష‌యం తెలిసిందే.
తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో హైప‌ర్ చిత్రం వ‌స్తుంది. 14 రీల్స్ నిర్మాణంలో వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. హైప‌ర్ సినిమాను సెప్టెంబ‌ర్ 30 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ఆచంట గోపి..సుంక‌ర అనిల్ స‌న్నాహాలు చేస్తున్నారు. రియ‌ల్ లైఫ్ లో రామ్ స్వ‌భావానికి ద‌గ్గ‌ర‌గా అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటుంద‌ని తెలిపారు ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్. మ‌రి వీరిద్ద‌రి కాంబో ఈ సారి ఏం చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
First Published:  26 Aug 2016 1:52 AM GMT
Next Story