రామ్ చ‌ర‌ణ్ ను భ‌య పెడుతున్న  సెంటి మెంట్స్…! 

సినీఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ల మయం… ప్రతీ చిన్న విషయంలోనూ శకునాలను చూసుకోవటం.., ఫెయిల్యూర్లకు కూడా ఆయా నటీ నటుల “ఫేట్” కారణం అవుతుందని నమ్మటం, వరసగా రెండు ఫ్లాపులు రాగానే ఐరన్ లెగ్ అనటం ఇలా ఇంకా చాలానే నమ్మకాలు సినీ ఇండస్ట్రీ లో ఉంటాయి…. కోట్ల వ్యవహారం కాబట్టి ఏ చిన్న రిస్కూ తీసుకోలేరు ఏమో..! ఆ నమ్మకమే నిజమవ్వచ్చేమో అన్న విషయాన్ని కూడా తేలికగా వదిలెయ్యలేరు… కానీ వరసగా మూడోసారి సెంటిమెంట్ ని కాదని రిస్క్ చేస్తున్నాడు రామ్ చరణ్. అంతే కాదు ఒక సినిమాని అనువాదం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా ధృవ టీం తీసుకోలేదు. అంతేకాదు… కాదు చరణ్ అన్నీ తనకు వ్యతిరేకంగా ఉండే పనులే చేస్తున్నాడు… సెంటిమెంట్లలాంటి నమ్మకాలు తనకు లేవని చెప్పాలనుకుంటున్నాడా..? ధృవ హిట్ తోనే ఆవిషయం చెప్పాలనుకుంటున్నాడేమో గానీ చెర్రీ రిస్క్ తీసుకుంటున్నాడేమో అనే వాళ్ళూ లేకపోలేదు. అసలింతకీ ఏమిటా సెంటిమెంట్… తనీ ఒరువన్ వల్ల ధృవకి వచ్చే నష్టమేమిటీ అంటే….
ఇప్పటి వరకు రెండు సార్లు దసరా బరిలో దిగిన చెర్రీ ఒక్క సారి కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అటుంచి మెగా స్టామినాకి తగ్గ కనీసం యావరేజ్ కూడా సాధించలేదు.
2014 లో దసరా కానుకగా వచ్చిన గోవిందుడు అందరివాడేలేతో జస్ట్ సోసో అనిపించుకుంది. చెర్రీ, 2015లో బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచాడు. ఆఖరికి మెగాస్టార్ క్యామియో కూడా బ్రూస్ లీ ని గట్టెక్కించలేకపోయింది.
మళ్ళీ దసరాకే అయితే ఇప్పుడు మళ్ళీ ఆ కలిసిరాని దసరాకే మళ్ళీ రాబోయే సినిమా ధృవ ని కూడా రిలీజ్ చేయటానికి సిద్దపడ్డాడు. పాత చేదు అనుభవాలని చూసి కూడా చెర్రీ భయపడకపోయినా… ఈ సారి కూడా ఈ సెంటిమెంట్ ప్రభావం సినిమా ఫలితాల మీద ఉంటుందేమో అని అభిమానులే కలవర పడుతున్నారు.
అయినా క‌థ‌లో కంటెంట్ వుంటే  ప‌నికి మాలిన సెంట్ మెంట్స్ తో ప‌ని ఉండ‌ద‌నేది ప‌రిశీల‌కుల  అభిప్రాయం. నిజ‌మే క‌దా. క‌థ‌లో  స‌త్తా లేకుంటే  ఎంత చేసినా  ఏమి ప్ర‌యోజ‌నం క‌దా!