Telugu Global
Cinema & Entertainment

అభిమానం  మితి మీరితే...! 

టాలీవుడ్ ని ఇప్పుడు కుదిపేస్తున్న విషయం పవన్ ఫ్యాన్ హత్య… అది మరో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్ప బడుతున్నవాళ్ళ చేతిలో జరగటం. ఈ ఒక్క సంఘటనతో ఈ ఇద్దరు హీరోలూ విపరీతమైన ఒత్తిడిలో పడ్డారు. అసలు తమ ప్రమేయం కూడా లేని సంఘటనకు కారణం మాత్రం తామే అయినందుకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి. అయితే చనిపోయిన వ్యక్తి పవన్ అభిమాని కావటం…, ఆయన పార్టీ కార్యకర్త కూడా కావటంతో […]

టాలీవుడ్ ని ఇప్పుడు కుదిపేస్తున్న విషయం పవన్ ఫ్యాన్ హత్య… అది మరో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్ప బడుతున్నవాళ్ళ చేతిలో జరగటం. ఈ ఒక్క సంఘటనతో ఈ ఇద్దరు హీరోలూ విపరీతమైన ఒత్తిడిలో పడ్డారు. అసలు తమ ప్రమేయం కూడా లేని సంఘటనకు కారణం మాత్రం తామే అయినందుకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి. అయితే చనిపోయిన వ్యక్తి పవన్ అభిమాని కావటం…, ఆయన పార్టీ కార్యకర్త కూడా కావటంతో పవన్ కాస్త త్వరగానే స్పందించాడు. వెంటనే తిరుపతి వెళ్ళి మరణించిన వినోద్ కుటుంబాన్ని ప్రత్యక్షంగా ఓదార్చటమే కాకుండా ఈ కేసు విషయం లో తన పూర్తి సహకారం ఉంటుందనీ హామీ ఇచ్చారు… ఆర్థికంగా కూడా ఆదుకున్నారు.
అయితే ఈ సంఘటనతో చిక్కుల్లో పడ్డది మాత్రం ఎన్టీఆరే… ఎందుకంటే ఆయన వెంటనే స్పందించి తిరుపతి వెళ్ళినా అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే… పోనీ వెంటనే మీడియాలో ఏదైనా ప్రకటన చేద్దామా అనుకునేలోగానే మీడియాలో ఆయన అభిమానే అంటూ వస్తున్న కథనాలతో మీడియా హోరెత్తిస్తూంటే అసలు ఏవరో తన అభిమాని అని చెప్పుకునే వ్యక్తి ఒక నేరం చేస్తే దానికి అసలేవిధంగా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాని సంధిగ్దం లోనే ఉన్నాడట యంగ్ టైగర్”. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఫ్యాన్స్ అంటూ బ్రేకింగ్ న్యూస్ లని టెలికాస్ట్ చేయటంతో అంతా రచ్ఛగా మారింది. ఇదిలా ఉంటే అసలు జరిగిన కథ ఏంటి అనేదానిపై ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు.
అభిమానం.. మితి మీరి ప్రాణాలు పోయో వ‌ర‌కు చంపుకోవ‌డం అనేది ఎవ‌రు హ‌ర్షించ ద‌గ్గ ప‌రిణామం కానే కాదు. అభిమానం పేరుతో ఎవ‌రి ఆధిప‌త్యాల్ని వారు నిరూపించుకునే ప్ర‌య‌త్నాల్లో ఇదంతా ఒక మాన‌సిక స‌మ‌స్యగా చెబుతున్నారు కొంద‌రు. మా హీరో గొప్ప అంటే..మా హీరో గొప్ప అనే వాద‌నల వెన‌క ..మేము గొప్పంటే .. మేము గొప్ప‌నే ఒక సూపిరియ‌ర్ కాంప్లేక్స్ స్ప‌ష్టంగా ఉంటుంది. గొప్ప అనేది చేసే వ్య‌క్తులు చేసే ప‌నులు .. వ్య‌క్తిత్వం వ‌ల్ల వ‌స్తుంది కానీ.. పుట్ట‌క‌తోనో.. డ‌బ్బుతోనే వ‌చ్చేవి కాద‌నే ఒక వాస్త‌వాని ఈ వెర్రి వీరాభిమానులు ఎప్ప‌టికి గ్ర‌హిస్తారో క‌దా.
First Published:  27 Aug 2016 3:58 AM GMT
Next Story