లొసుగులు లేకుంటే భయమెందుకు?- బాబు, వెంకయ్యపై ఫైర్

తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా పవన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు పదేపదే కేంద్రంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారని అలా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా బ్రహ్మరాక్షసా అని ప్రశ్నించారు. మీకు ఎలాంటి లొసుగులు లేకుంటే కేంద్రంతో పోరాడేందుకు భయమెందుకు అని నిలదీశారు. హోదా కోసం పోరాడితే సీబీఐ వస్తుందని అంటున్నారని… ఆ భయం ఎందుకు ఉందో చెప్పాలన్నారు. హోదా కోసం ఎంపీలు పార్లమెంట్‌ను ఎందుకు స్తంభింపచేయడం లేదో చెప్పాలన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని సూచించారు. కేశినేని నాని, మురళీ మోహన్‌, మంత్రి నారాయణలను చూసి కాకుండా ప్రజల కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రధాని దగ్గర సర్ సర్ అని అడుక్కోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. గతంలో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు హోదాతో పనేముందని మాట్లాడుతుంటే విసుగొస్తోందన్నారు. వెంకయ్యనాయుడు మీరు తప్పు చేస్తున్నారు అని పవన్ అన్నారు. మీ గారడి మాటలు పక్కనపెట్టండి అని డిమాండ్ చేశారు.

Click on Image to Read:

pawan tirupathi speeach

pawan tirupati sabha

undavalli

jana sena

brahmini

Sudharani Boyapati

natti kumar

SRM University chancellor Pachamuthu arrested in Chennai

ysrcp praveen kumar reddy