Telugu Global
Cinema & Entertainment

ఓ స్టార్  హీరోకు త‌ప్ప‌ని  దుర్బ‌ర‌మైన రోజులు...!

బాలీవుడ్ లో లవర్ బాయ్ గా, క్యూట్ హీరోగా, ఫైనెస్ట్ యాక్టర్‌గా, మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన షాహిద్ తొలినాళ్లలో దుర్భమైన జీవితం గడిపాడట. ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ తన కెరీర్, పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. చేతిలో డబ్బు లేక, తినడానికి తిండిలేక తన జీవితంలో […]

ఓ స్టార్  హీరోకు త‌ప్ప‌ని  దుర్బ‌ర‌మైన రోజులు...!
X

బాలీవుడ్ లో లవర్ బాయ్ గా, క్యూట్ హీరోగా, ఫైనెస్ట్ యాక్టర్‌గా, మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన షాహిద్ తొలినాళ్లలో దుర్భమైన జీవితం గడిపాడట. ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ తన కెరీర్, పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. చేతిలో డబ్బు లేక, తినడానికి తిండిలేక తన జీవితంలో అత్యంత దుర్భరంగా గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు.

చాలా మంది నేను పంకజ్ కపూర్ కొడుకును…అతనికి తప్పకుండా బ్రేక్ వస్తుంది అనుకున్నారు. కానీ తొలి 100 ఆడియన్స్‌లో నేను ఎంపిక కాలేదు, రిజక్ట్ అయ్యాను అని షాహిద్ తెలిపారు. చేతిలో డబ్బు లేదు తిండి లేదు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్ వెళ్లే సమయంలో ఏదైనా తినడానికి డబ్బు ఉండేది కాదు. అలాంటి జీవితం కూడా అనుభవించాను. దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండుదు. బట్ దట్ ఈజ్ మై రియాల్టీ అని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చాడు.

ఎన్ని సార్లు రిజక్ట్ అయినా మళ్లీ మళ్లీ ప్రయత్నించాను. దేవుడు ఎప్పటికైనా నాకు అవకాశం ఇస్తాడినే నమ్మకంతో ఉండే వాడిని అని షాహిద్ కపూర్ తెలిపారు. మా పేరెంట్స్ యాక్టర్సే. కానీ వారు ఇండస్ట్రీలో బాగా పేరు, పలుకుబడి ఉన్న స్టార్స్ కాదు. దీంతో వారి వారసత్వం సినిమా అవకాశాలు రావడానికి తోడ్పడలేదు అన్నారు షాహిద్. నా టాలెంటును నమ్ముకుని అవకాశాల కోసం ప్రయత్నించాను. ఏ విషయంలో అయినా నేను అంత ఈజీగా సంతృప్తి చెందను అని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు.నేను ఈ స్థాయికి చేరడానికి 13ఏళ్ల సమయం పట్టింది. నేను రిలాక్స్ గా ఫీలవ్వడానికి మరో పదమూడేళ్ల సమయం పట్టొచ్చు అని షాహిద్ అన్నారు.

First Published:  28 Aug 2016 1:00 AM GMT
Next Story