Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి మెగా బిజినెస్ ఉత్తిదే...

చిరంజీవి 150వ సినిమా భారీ రేటుకు అమ్ముడుపోతోందని, ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఓవర్సీస్, నైజాంలో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందంటూ ఈమధ్య కాలంలో చాలా వార్తలు వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్-150కు నిర్మాతగా వ్యవహరిస్తున్న చెర్రీ.. ఇప్పటివరకు ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభించలేదని స్పష్టం చేశాడు. బయ్యర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి చిరంజీవి సినిమా దాదాపు 50శాతం కంప్లీట్ […]

చిరంజీవి మెగా బిజినెస్ ఉత్తిదే...
X

చిరంజీవి 150వ సినిమా భారీ రేటుకు అమ్ముడుపోతోందని, ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఓవర్సీస్, నైజాంలో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందంటూ ఈమధ్య కాలంలో చాలా వార్తలు వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్-150కు నిర్మాతగా వ్యవహరిస్తున్న చెర్రీ.. ఇప్పటివరకు ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభించలేదని స్పష్టం చేశాడు. బయ్యర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతానికి చిరంజీవి సినిమా దాదాపు 50శాతం కంప్లీట్ అయిందంటున్నాడు చరణ్. హీరోయిన్ కన్ ఫర్మ్ అయింది కాబట్టి… మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ దాదాపు 70శాతం కంప్లీట్ అవుతుందని, అప్పుడు ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి ఆలోచిస్తామని చెర్రీ వివరణ ఇచ్చాడు. అందరికీ అందుబాటులో ధరల్లోనే చిరంజీవి 150వ సినిమా ఉంటుందని చరణ్ స్పష్టంచేశాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నంబర్-150 తెరకెక్కుతోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిరంజీవి 150వ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.

First Published:  28 Aug 2016 11:33 PM GMT
Next Story