Telugu Global
Cinema & Entertainment

డీజే ప్రారంభమైంది...

సాధారణంగా పబ్ ల్లో, కాలేజ్ ఫంక్షన్లలో డీజే ప్రారంభమౌతుంది. కానీ ఈసారి ఇదే డీజేని బన్నీ ప్రారంభించాడు. అవును… అల్లు అర్జున్ కొత్త సినిమా పేరు డీజే. ఇక్కడ డీజే అంటే దువ్వాడ జగన్నాథమ్. ఇప్పటికే టైటిల్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకులు వీవీ వినాయక్, వంశీ పైడిపల్లి, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బన్నీ […]

డీజే ప్రారంభమైంది...
X
సాధారణంగా పబ్ ల్లో, కాలేజ్ ఫంక్షన్లలో డీజే ప్రారంభమౌతుంది. కానీ ఈసారి ఇదే డీజేని బన్నీ ప్రారంభించాడు. అవును… అల్లు అర్జున్ కొత్త సినిమా పేరు డీజే. ఇక్కడ డీజే అంటే దువ్వాడ జగన్నాథమ్. ఇప్పటికే టైటిల్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకులు వీవీ వినాయక్, వంశీ పైడిపల్లి, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్, తొలి షాట్ కు క్లాప్ కొట్టారు. దైవ సన్నిధానంలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమం సింపుల్ గా జరిగింది. మరో 10 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తాడు. సరైనోడు తర్వాత 4 నెలల సుదీర్ఘ విరామం తీసుకొని, బన్నీ స్టార్ట్ చేసిన సినిమా ఇది. ఇందులో హీరోయిన్ గా ఇంకా ఎవర్నీ ఎంపిక చేయలేదు. పూజా హెగ్డే పేరు మాత్రం పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో డీజే ను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.
First Published:  29 Aug 2016 3:39 AM GMT
Next Story