Telugu Global
NEWS

ముఖ్య‌మంత్రిపై కేటీఆర్ ఉద్య‌మం!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు అధికార పార్టీలో కొత్త‌ చిచ్చులు రేపుతున్నాయి. ఫ‌లితంగా ఇంత‌కాలం స్నేహంగా మెదిలిన నాయ‌కుల మ‌ధ్య విభేదాలు పొడ‌సూపుతున్నాయి. పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవ‌ల హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని మూడు జిల్లాల్లోకి పంచ‌డం..  కేసీఆర్, ఆయన చిర‌కాల మిత్రుడు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావుల మ‌ధ్య చిచ్చుపెట్టింది. తాజాగా సిరిసిల్ల‌ను జిల్లా విష‌యంలో అన్న మాట ప్ర‌కారం.. ముందుకు పోక‌పోవ‌డంతో ఇప్పుడు ఏకంగా తండ్రీ కొడుకుల మ‌ధ్యే నిప్పురాజేసింది. నిన్న మొన్న‌టి […]

ముఖ్య‌మంత్రిపై కేటీఆర్ ఉద్య‌మం!
X
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు అధికార పార్టీలో కొత్త‌ చిచ్చులు రేపుతున్నాయి. ఫ‌లితంగా ఇంత‌కాలం స్నేహంగా మెదిలిన నాయ‌కుల మ‌ధ్య విభేదాలు పొడ‌సూపుతున్నాయి. పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవ‌ల హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని మూడు జిల్లాల్లోకి పంచ‌డం.. కేసీఆర్, ఆయన చిర‌కాల మిత్రుడు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావుల మ‌ధ్య చిచ్చుపెట్టింది. తాజాగా సిరిసిల్ల‌ను జిల్లా విష‌యంలో అన్న మాట ప్ర‌కారం.. ముందుకు పోక‌పోవ‌డంతో ఇప్పుడు ఏకంగా తండ్రీ కొడుకుల మ‌ధ్యే నిప్పురాజేసింది. నిన్న మొన్న‌టి దాకా కొత్త జిల్లాల జాబితాలో సిరిసిల్ల ఉంటుంద‌టూ బాగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ ఘ‌న‌త అంతా మంత్రి కేటీఆర్ కే ద‌క్కుతుందంటూ అక్క‌డున్న స్థానికులు మంత్రిని ఆకాశానికెత్తేశారు. నిజంగానే సిరిసిల్ల జిల్లాగా అవ‌త‌రిస్తే.. త‌మ నాయ‌కుడికి తిరుగుండ‌దంటూ కేటీఆర్ అనుచరులు కూడా పండ‌గ చేసుకున్నారు. ఆర్థికంగా, జ‌నాభా, భౌగోళిక ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన ప్ర‌భుత్వం జిల్లాగా సిరిసిల్ల మ‌నుగ‌డ సాధించ‌లేద‌ని తేల్చేసింది. ఫ‌లితంగా తుదిజాబితాలో సిరిసిల్ల‌కు చోటు ద‌క్కలేదు. దీంతో స్థానికులు భ‌గ్గుమ‌న్నారు. ఏకంగా కేటీఆర్‌, కేసీఆర్ ప్లెక్ల్సీల‌ను ద‌హ‌నం చేశారు. అన్ని పార్టీల నాయ‌కులు ఏక‌మై జేఏసీ ఏర్పాటు చేశారు.
రాజ‌కీయ వేడెక్క‌డంతో గులాబీనేత‌లు సైతం ఉద్య‌మంలో పాలుపంచుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. త‌మ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై తామే తిరుగుబాటు చేయ‌డం అక్క‌డి టీఆర్ ఎస్ నాయ‌కుల‌కు ఇష్టం లేకున్నా.. పాల్గొంటున్నారు. ఇంత‌కాలం సిరిసిల్ల జిల్లా అంటూ ప్ర‌జ‌ల్లో ఆశ‌లు రేకెత్తించి.. ఇప్పుడు అవేమీ సాకారం కాక‌పోవ‌డంతో విధిలేక ప్ర‌జ‌ల్లో క‌లిసి ఉద్య‌మంలో పాల్గొంటున్నారు. సిరిసిల్ల మునిసిపాలిటీల్లో ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన కౌన్సిల‌ర్లు త‌మ ప‌ద‌వుల‌కు సామూహికంగా రాజీనామా చేశారు. దీంతో అధికార పార్టీ కౌన్సిల‌ర్ల‌పైనా రాజీనామా చేయాల‌న్న‌ ఒత్తిడి పెరిగింది. జిల్లాను సాధించేదాకా విశ్ర‌మించేది లేద‌ని జిల్లా సాధ‌న జేఏసీ స్ప‌ష్టం చేస్తోంది. అన్ని వైపుల నుంచి ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్త‌డంతో కేటీఆర్ కూడా వారికి జ‌త‌క‌లిశారు. స్వ‌యంగా ఆయ‌న ఇంట్లోనే ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ రూపుదిద్దుకోవ‌డం విశేషం. మొత్తానికి కొత్త జిల్లాల విష‌యంలో కేసీఆర్ కే వ్య‌తిరేకంగా కేటీఆర్ ఉద్య‌మాన్ని రూపొందిస్తుండ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని ఏర్ప‌రుస్తోంది.
First Published:  28 Aug 2016 10:18 PM GMT
Next Story