ఈ జ‌న్మ‌కు  ఇదే ఆనందం ..!

మ‌న ద‌క్షిణాది న‌టీ మ‌ణులు బాలీవుడ్ జెండా పాత‌డం ఇప్పుడంటే  సాధ్య ప‌డ‌టం లేదు గానీ. జ‌యా బాధురి  జ‌న‌రేష‌న్ లో అయితే  మ‌న సౌత్ నుంచి  హేమా మాలిని..   రేఖా.. వ‌హిదా రెహ‌మాన్   లు  త‌మ ప్ర‌తిభ‌తో అక్క‌డ  అగ్ర తార‌మ‌ణులుగా  హ‌ల్ చ‌ల్ చేశారు. వారిలో  హేమా మాలిని  ఒక‌రు.   షోలే చిత్రంలో బాసంతిగా ఆమే మార్క్  హుషారైన యాక్టింగ్  తో    అక్క‌డే సెటిల‌య్యింది.  ప్ర‌స్తుతం  సినిమాల‌కు విరామం ఇచ్చిన ఈ సినీయ‌ర్ న‌టి..  చాలా కాలం త‌రువాత ..  బాల‌య్య న‌టిస్తున్న  గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సినిమా లో న‌టించ‌బోతున్నార‌ట‌.

తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో ‘గౌతమి’గా నటిస్తుండటం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. ఇది శాతవాహనుల పాలన నేపథ్యంలో సాగే సినిమా, తొలి శతాబ్దంలో ఇండియా మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన ఆంధ్రా రాజు శాతకర్ణి గురించి స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన తల్లి స్ఫూర్తితోనే శాతకర్ణి ఇదంతా సాధించినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి తల్లి పాత్రలో నేను కనిపించబోతున్నాను అని హేమమాలిని ట్విట్టర్లో పేర్కొంది.  బాల‌య్య  న‌టిస్తున్న 100 వ  చిత్రాన్ని డైరెక్ట్ చేసే చాన్స్ రావడంతో  ద‌ర్శ‌కుడు క్రిష్  ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా సినిమాను   తీర్చి దిద్దుతున్న‌ట్లు టాక్ .