Telugu Global
Cinema & Entertainment

జ‌న‌తా గ్యారేజ్ కు ప్ర‌చారం పెంచేశారు

ఎన్టీఆర్  సినిమా పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి అని  ఇప్పుడు చెప్ప‌లేం. ఎందుకంటే.. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ  మాస్ ఇమేజ్  భ‌యంక‌రంగా వున్న  ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తున్నారు అనేది  ప్ర‌స్తుతం  యంగ్ టైగ‌ర్ అభిమానుల్లో వున్న  ఒక చిన్న‌పాటి సందేహాం.   శ్రీ‌మంతుడు  స‌మ‌యంలో  మ‌హేష్ బాబు  గురించి ఇలాగే కొంత ఆంద‌ళన మ‌హేష్ ఫ్యాన్స్ లో క‌నిపించింది. క‌ట్ చేస్తే..  జ‌న‌తా గ్యారేజ్  శుక్రవారం ప్ర‌పంచ వ్యాప్తంగా  రిలీజ్ కు సిద్దం అయ్యింది.    ఎన్టీఆర్ స‌ర‌స‌న […]

జ‌న‌తా గ్యారేజ్ కు ప్ర‌చారం పెంచేశారు
X

ఎన్టీఆర్ సినిమా పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి అని ఇప్పుడు చెప్ప‌లేం. ఎందుకంటే.. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాస్ ఇమేజ్ భ‌యంక‌రంగా వున్న ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తున్నారు అనేది ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ అభిమానుల్లో వున్న ఒక చిన్న‌పాటి సందేహాం. శ్రీ‌మంతుడు స‌మ‌యంలో మ‌హేష్ బాబు గురించి ఇలాగే కొంత ఆంద‌ళన మ‌హేష్ ఫ్యాన్స్ లో క‌నిపించింది.

క‌ట్ చేస్తే.. జ‌న‌తా గ్యారేజ్ శుక్రవారం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్దం అయ్యింది. ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ లు న‌టిస్తున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు వంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చి ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా చాటుకున్నాడు. మ‌హేష్ తో ఒక సింపుల్ పాయింట్ ను శ్రీ‌మంతుడిగా తీసి అద‌ర‌హో అనిపించాడు. మ‌హేష్ బాబు కెరీర్ లోనే హైయ‌స్ట్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రంగా నిలిపాడు. తాజాగా ఎన్టీఆర్ తో చేసిన గ్యారేజ్ ..బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో. ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం అందించారు. ఇక ప్ర‌చార ప‌రంగా మీడియాకు ఇంట‌ర్వూలు చేసి మైత్రి మూవీస్ వారు దండిగా ఫీడ్ అందిస్తున్నారు. అల్రేడి సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో కావాల‌సినంత ప్ర‌చారం న‌డుస్తుంది. మ‌రో వైపు టీవిల్లో .. సినిమా మ్యాగ‌జైన్స్ అంత‌టా జ‌న‌తా గ్యారేజే ఈవారం. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Click to Read….

మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..? మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..?

First Published:  30 Aug 2016 3:43 AM GMT
Next Story