Telugu Global
Cinema & Entertainment

శరవేగంగా దూసుకుపోతున్న మహేష్...

ఒక్కసారి కమిట్ అయితే మహేష్ తన మాట తానే వినడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయంలో అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు ప్రిన్స్. మురుగదాస్ సినిమాను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. అవసరం అయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు సెట్స్ లోనే ఉంటున్నాడు. తనతో ఎన్ని సన్నివేశాలు కావాలంటే అన్ని సీన్లు తీస్కోండని యూనిట్ కు చెబుతున్నాడు. ఇలా ఫుల్ గా కోపరేట్ చేస్తున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్-మురగదాస్ సినిమా హైదరాబాద్ లోని సారధి స్టుడియోస్ లో జరుగుతోంది. […]

శరవేగంగా దూసుకుపోతున్న మహేష్...
X

ఒక్కసారి కమిట్ అయితే మహేష్ తన మాట తానే వినడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయంలో అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు ప్రిన్స్. మురుగదాస్ సినిమాను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. అవసరం అయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు సెట్స్ లోనే ఉంటున్నాడు. తనతో ఎన్ని సన్నివేశాలు కావాలంటే అన్ని సీన్లు తీస్కోండని యూనిట్ కు చెబుతున్నాడు. ఇలా ఫుల్ గా కోపరేట్ చేస్తున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్-మురగదాస్ సినిమా హైదరాబాద్ లోని సారధి స్టుడియోస్ లో జరుగుతోంది. కథ ప్రకారం… గుంపులు, జనాలు ఉన్న ప్రాంతంలో మహేష్ పై కొన్ని సన్నివేశాలు తీయాలి. ఎన్నిసార్లు ప్రయత్నించినా సీన్ మాత్రం అనుకున్న విధంగా రావడం లేదు. దీంతో ఒక రోజంతా స్టుడియోలోనే ఉండిపోయాడు పవన్. మురుగ అనుకున్న సీన్ వచ్చినంత వరకు జనాల మధ్యలో అలా నిల్చొనే ఉన్నాడు. ఎట్టకేలకు ఈ సీన్ కంప్లీట్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది జనవరి నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

Click to Read….

మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..? మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..?

First Published:  30 Aug 2016 2:13 AM GMT
Next Story