Telugu Global
Cinema & Entertainment

బిజినెస్ మెన్ తో సోనమ్ క‌పూర్ డేటింగా..!

బాలీవుడ్ స్టైల్ ఐకాన్ గా పేరున్న సోన‌మ్ క‌పూర్ సినిమాల ప‌రంగా  ఘ‌న విజ‌యాలు ఏమి లేక‌పోయిన‌ప్ప‌టికి..   స్టైల్ ప‌రంగా మాత్రం  మీడియాలో  మంచి  ప్ర‌చారం గెయిన్ చేసింది. ఆఫ్ కోర్స్   అనిల్ క‌పూర్ త‌న‌య‌గా  ఆమేకు పెద్ద‌గా ప్ర‌చారం  అవ‌స‌రం లేక పోవ‌చ్చు గానీ.. న‌టి అయిన త‌రువాత  త‌న కంటూ ఒక ప్ర‌త్యేక‌త నిల‌పుకోవాల్సి వుంటుంది. ఈ జ‌ర్నీలో  సోన‌మ్  ఇండ‌స్ట్రీకి  ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టి నుంచి   ఇప్ప‌టి వ‌ర‌కు   రెండు మూడు చిత్రాలు ప‌ర‌వాలేద‌నిపించింది. […]

బిజినెస్ మెన్ తో సోనమ్ క‌పూర్ డేటింగా..!
X

బాలీవుడ్ స్టైల్ ఐకాన్ గా పేరున్న సోన‌మ్ క‌పూర్ సినిమాల ప‌రంగా ఘ‌న విజ‌యాలు ఏమి లేక‌పోయిన‌ప్ప‌టికి.. స్టైల్ ప‌రంగా మాత్రం మీడియాలో మంచి ప్ర‌చారం గెయిన్ చేసింది. ఆఫ్ కోర్స్ అనిల్ క‌పూర్ త‌న‌య‌గా ఆమేకు పెద్ద‌గా ప్ర‌చారం అవ‌స‌రం లేక పోవ‌చ్చు గానీ.. న‌టి అయిన త‌రువాత త‌న కంటూ ఒక ప్ర‌త్యేక‌త నిల‌పుకోవాల్సి వుంటుంది. ఈ జ‌ర్నీలో సోన‌మ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మూడు చిత్రాలు ప‌ర‌వాలేద‌నిపించింది.

కానీ ఈ మ‌ధ్య ఢిల్లికి చెందిన అంత‌ర్జాతీయ ఫ్యాష‌న్ క్లాత్ బిజినెస్ మెన్ ఆనంద్ అహూజా అనే అతనితో క్లోజ్ గా మూవ్ అవుతుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. వీరిద్ద‌రు క‌ల‌సి లేటెస్ట్ గా అక్ష‌య్ కుమార్ ఇచ్చిన ఒక పార్టీకి అటెంట్ అయిన‌ట్లు తెలుస్తుంది. సినిమాల ప‌రంగా గ‌త యేడాది ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చేసి మెప్పించింది. 2010 లో ఐ హేట్ ల‌వ్ స్టోరీస్ డైరెక్ట‌ర్ పునీత్ మ‌ల్హోత్రా తో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు అప్ప‌ట్లో రూమ‌ర్స్ వినిపించాయి.

First Published:  29 Aug 2016 11:17 PM GMT
Next Story