Telugu Global
Cinema & Entertainment

వచ్చేనెల 9న ఇంకొక్కడు...

రెండు విలక్షణమైన పాత్రల్లో విక్రమ్ నటించిన సినిమా ఇంకొక్కడు. తమిళ్ లో ఇరుముగమ్ పేరిట తెరకెక్కిన ఈ సినిమాను ఇంకొక్కడు పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఈ మూవీని సెప్టెంబర్ 9న విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. సినిమాలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రయిలర్ కు మంచి ఆదరణ లభించింది. యంగ్ క్యారెక్టర్ లో, ట్రాన్స్ జెండర్ పాత్రలో విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. ట్రాన్స్ జెండర్ లో […]

వచ్చేనెల 9న ఇంకొక్కడు...
X
రెండు విలక్షణమైన పాత్రల్లో విక్రమ్ నటించిన సినిమా ఇంకొక్కడు. తమిళ్ లో ఇరుముగమ్ పేరిట తెరకెక్కిన ఈ సినిమాను ఇంకొక్కడు పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఈ మూవీని సెప్టెంబర్ 9న విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. సినిమాలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రయిలర్ కు మంచి ఆదరణ లభించింది. యంగ్ క్యారెక్టర్ లో, ట్రాన్స్ జెండర్ పాత్రలో విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. ట్రాన్స్ జెండర్ లో విక్రమ్ చేసిన పాత్రే సినిమాకు హైలెట్ గా చెబుతున్నారు. మరోవైపు నయనతార అందాలు సినిమాకు క్రౌడ్ పుల్లర్ గా పనిచేస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించాడు విక్రమ్. కేరళ నుంచి ఈ సినిమా ప్రమోషన్ షురూ అయింది. తమిళనాడులో ఇప్పటికే పబ్లిసిటీ నడుస్తోంది. జనతా గ్యారేజ్ విడుదలైన వెంటనే తెలుగులో కూడా విక్రమ్ ప్రమోషన్ ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక రోజంతా హైదరాబాద్ లోనే గడపనున్నాడు విక్రమ్.
First Published:  30 Aug 2016 2:22 AM GMT
Next Story