ఎన్టీఆర్ క్యాంప్ ను  వ‌క్కంతం వంశీ ఎందుకు వ‌దిలేశాడు..!

ఎన్టీఆర్  ఒక సారి  మాట ఇస్తే  త‌ప్ప‌డు అనే టాక్ ఉంది. అలాగే ఆయ‌న‌తో ఫ్రెండ్ షిప్ కూడా  ఒక్క‌సారి క‌నెక్ట్ అయితే వ‌ద‌ల‌డం అనేది ఉండ‌దంటారు.  కానీ ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఎన్టీఆర్ క్యాంప్ ను వ‌దిలేసిన‌ట్లు తెలుస్తుంది.   ఎన్టీఆర్ కు  టెంప‌ర్ వంటి సినిమా క‌థ‌ను  ఇచ్చిన వ‌క్కంతం వంశీ తో సినిమా చేయ‌నున్న‌ట్లు ఎన్టీఆర్ గ‌తంలో ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం  జ‌న‌తా గ్యారేజ్  తో ఆడియ‌న్స్ ను కు సిద్ద‌మైన ఎన్టీఆర్..ఈ చిత్రం త‌రువాత కొంత గ్యాప్ ను తీసుకోనున్న‌ట్లు  ఒక ఇంట‌ర్వూలో  చెప్పారు.
ఇలా చెప్పడం వెనుక బలమైన కారణమే వుందని తెలుస్తోంది. వక్కంతం వంశీ తనంతట తానే ఎన్టీఆర్ క్యాంప్ వీడి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు అలా వచ్చేసాడు అన్నది తెలియదు కానీ, వచ్చేసిన మాట మాత్రం పక్కా అని తెలిసింది. సో, ఇక ఎన్టీఆర్ తరువాత సినిమా మరి ఎవరు డైరక్ట్ చేస్తారో చూడాలి.  
కొర‌టాల శివ , ఎన్టీఆర్  కాంబినేష‌న్ లో  జ‌న‌తా గ్యారేజ్ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయాల‌ని  ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు.