Telugu Global
Cinema & Entertainment

పవన్ సినిమా కోసం మరో టైటిల్...

ప్రస్తుతం డాలీ డైరక్షన్ లో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. పవర్ స్టార్ ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోయినప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుకు మొన్నటివరకు కడప కింగ్ అనే టైటిల్ ను అనుకున్నారు. దర్శకుడు శరత్ మరార్ కూడా అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. కానీ ఇప్పుడు తాజాగా పవన్ కొత్త సినిమాకు సంబంధించి మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాకు కాటమరాయుడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుందని […]

పవన్ సినిమా కోసం మరో టైటిల్...
X

ప్రస్తుతం డాలీ డైరక్షన్ లో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. పవర్ స్టార్ ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోయినప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుకు మొన్నటివరకు కడప కింగ్ అనే టైటిల్ ను అనుకున్నారు. దర్శకుడు శరత్ మరార్ కూడా అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. కానీ ఇప్పుడు తాజాగా పవన్ కొత్త సినిమాకు సంబంధించి మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాకు కాటమరాయుడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తోందట. అత్తారింటికి దారేది సినిమాతో ఈ టైటిల్ బాగా పాపులర్ అయింది. ఆ సినిమాలో కాటమరాయుడా అనే పాటను పవన్ స్వయంగా పాడాడు. అప్పట్నుంచి ఆ పేరు తరచుగా వినిపిస్తూనే ఉంది. మళ్లీ ఇన్నేళ్లకు, పవన్ సినిమా కోసమే ఆ టైటిల్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే పవన్-డాలీ కొత్త సినిమాకు ఆ టైటిల్ పెడుతున్నారా లేదా అనే అంశంపై మాట్లాడేందుకు మాత్రం యూనిట్ సభ్యులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎప్పుడు తన సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చే నిర్మాత శరత్ మరార్ కూడా ఈసారి సైలెంట్ అయిపోయాడు. దీనికి కారణం పవన్ ఇంకా ఈ టైటిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్, సెట్స్ పైకి వచ్చిన వెంటనే టైటిల్ పై ఓనిర్ణయం తీసుకుంటాడట. అప్పుడు ఆ పేరును అధికారికంగా ప్రకటించాలని యూనిట్ భావిస్తోంది. అంతవరకు సినిమా టైటిల్ పై ఈ సస్పెన్స్ తప్పదు.

Click to Read

జనతా గ్యారేజ్ కు వర్షం దెబ్బ జనతా గ్యారేజ్ కు వర్షం దెబ్బ

First Published:  31 Aug 2016 10:18 PM GMT
Next Story