Telugu Global
National

త‌క్కువ ప్రమాదం ఉండే షెల్స్‌ను ఎందుకు ఉప‌యోగించలేదు?

కాశ్మీర్‌లో ఆందోళ‌న కారుల‌ను అదుపు చేసేందుకు ప్ర‌భుత్వ అల‌స‌త్వం కార‌ణంగానే తక్కువ శక్తి గ‌ల షెల్స్‌ను ఉప‌యోగించ‌లేద‌నే విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన ఫైలును ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పాత్రికేయులు సంపాదించారు. ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం 2010లోనే త‌క్కువ శక్తి గ‌ల షెల్స్‌ను ఉప‌యోగించాల‌ని ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ సంవ‌త్స‌రంలో కాశ్మీర్‌లో జ‌రిగిన అల్ల‌ర్ల సంద‌ర్భంగా జ‌రిగిన పోలీస్ కాల్పుల్లో 110 మంది ఆందోళ‌న కారులు మ‌ర‌ణించారు. దీని వ‌ల్ల అప్ప‌టి […]

త‌క్కువ ప్రమాదం ఉండే షెల్స్‌ను ఎందుకు ఉప‌యోగించలేదు?
X
కాశ్మీర్‌లో ఆందోళ‌న కారుల‌ను అదుపు చేసేందుకు ప్ర‌భుత్వ అల‌స‌త్వం కార‌ణంగానే తక్కువ శక్తి గ‌ల షెల్స్‌ను ఉప‌యోగించ‌లేద‌నే విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన ఫైలును ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పాత్రికేయులు సంపాదించారు. ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం 2010లోనే త‌క్కువ శక్తి గ‌ల షెల్స్‌ను ఉప‌యోగించాల‌ని ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ సంవ‌త్స‌రంలో కాశ్మీర్‌లో జ‌రిగిన అల్ల‌ర్ల సంద‌ర్భంగా జ‌రిగిన పోలీస్ కాల్పుల్లో 110 మంది ఆందోళ‌న కారులు మ‌ర‌ణించారు. దీని వ‌ల్ల అప్ప‌టి ప్ర‌భుత్వం అనేక విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్న‌ది. ఈ కార‌ణంగానే త‌క్కువ శక్తి (లెస్ లెథాల్‌) ఉన్న షెల్స్‌ను ఉప‌యోగించాల‌ని నిపుణుల క‌మిటీ సూచించిన అంశానికి ప్ర‌భుత్వం ఆమోదం ల‌భించింది. అయితే దాని అమ‌లులో కొంత మంది అధికారులు తీవ్ర మైన నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంతో చాలా న‌ష్టం జ‌రిగింది.
ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లో 573 మందికి కంటి గాయాలయ్యాయి. ఇందులో 20 మంది శాశ్వ‌తంగా కంటిచూపును కోల్పోయారు. ఒక మ‌నిషికి అంధ‌త్వం సంభ‌విస్తే ఆ బాధ‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. ఆ క‌ష్టం అనుభ‌వించేవారికే తెలుస్తుంది. ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు ప్ర‌యోగిస్తున్న పెల్లెట్లు చాలా శక్తివంతమైనవి. అందులో ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలున్న‌ట్లు కొంత మంది నేత‌లు ప్ర‌ధాని మోడీకి దృష్టికి తీసుకు వ‌చ్చారు. అయితే త‌క్కువ ప్ర‌మాదం గ‌ల ప‌రిక‌రాల‌ను త‌క్ష‌ణ‌మే ఉప‌యోగించాల‌ని ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో మోడీ ప్ర‌భుత్వం మ‌రో నిపుణుల క‌మిటీని నియ‌మించింది. ఆ కమిటీ కూడా పెల్లెట్లు ప్ర‌మాద‌క‌ర‌మైన‌వ‌ని, విష‌య‌పూరిత‌మైన‌వ‌ని తేల్చింది. మిర‌ప‌కాయల్లో ఉండే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాల‌తో సిద్ధం చేసిన ఈ ప‌రిక‌రాలు త‌క్కువ ప్రాణాంత‌క‌మైన‌వి. అంతేకాదు ఇవి ఆందోళ‌న కారుల‌పై స్ప‌ల్ప‌కాలం పాటే ప్ర‌భావం చూపుతాయి. దీంతో పెల్లెట్ గ‌న్లకు ప్ర‌త్యాయ్నాయంగా వీటిని ఉప‌యోగించాల‌ని నిపుణులు సూచించారు. వీటినే పావా షెల్స్ అని పిలుస్తారు. పావా అన‌గా పెలార్గ‌నిక్ యాసిడ్ వ‌నిలిల్ అమైడ్, దీనినే నోని వామైడ్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎండు మిర్చిలో సహ‌జంగా క‌నిపించే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు గ‌రిష్ట స్థాయికి మించిన శక్తితో ఉంటాయి. నిర‌స‌న కారుల‌కు తీవ్ర‌మైన మంట క‌ల్పిస్తాయి. అయితే ఇది తాత్కాలిక‌మే. పెల్లెట్‌ల కంటే పావా షెల్స్ ప్ర‌భావ వంతంగా ప‌ని చేస్తాయ‌ని నిపుణుల క‌మిటీ గుర్తించింది.
వీటిని భ‌ద్ర‌తా ద‌ళాలు మొద‌ట ఉప‌యోగించాల‌ని, ఆందోళ‌న కారుల‌ను అదుపు చేయాల‌ని అప్ప‌టి మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు 2010 ఆగ‌స్టు 26న జ‌రిగిన డీజీపీల స‌మావేశంలో పావా షెల్స్ ఉప‌యోగం గురించి అప్ప‌టి ప్ర‌ధాని నొక్కి చెప్పారు. అయినా అధికారుల చెవుల‌కు ఆ మాట‌లు ఎక్క‌లేదు. కొంత‌మంది అధికారులు అనుమానాలు వ్య‌క్తం చేశారు. వాటిని నివృత్తి చేసేందుకు స‌రైన ప్ర‌య‌త్నాలు జ‌రుగ‌లేదు. అంతేకాకుండా వాటిని త‌యారు చేసేందుకు కూడా అవ‌స‌ర‌మైన శ్ర‌ద్ధ తీసుకోలేదు. దీంతో ఆందోళ‌న కారుల‌కు త‌క్కువ న‌ష్టం క‌లిగించే పావా షెల్స్ ఉప‌యోగించాల‌ని ప‌థ‌కం అట‌కెక్కింది. ఆ ఫైలు దుమ్ము కొట్టుకు పోయింది. ప్ర‌భుత్వం అల‌స‌త్వంపై దేశ‌వ్యాప్తంగా అనేక విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అంతేకాకుండా పెల్లెట్ల ఉప‌యోగంపై ప్ర‌పంచంలోని అనేక దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నాయి.
2005లో అమెరికాలోని బోస్ట‌న్‌లో పెల్లెట్ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఒక మ‌హిళ మృతి చెందింది. పెల్లెట్ల‌ను చాతీకి కింది వైపునే ప్ర‌యోగించాల‌నే నిబంధ‌న‌ల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు పాటించ‌డం లేదు. ఈ విష‌యంలో వారికి స‌రైనా శిక్ష‌ణ లేదు. ప్ర‌స్తుతం ప్ర‌తిపాద‌న ద‌శ‌లో ఉన్న పావా షెల్స్‌ను ఉప‌యోగించ‌డంలో వెంట‌నే శిక్ష‌ణ అవ‌స‌ర‌ముంద‌ని ఈ విష‌యంలో కూడా అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే 2010 ఫైలుకు ప‌ట్టిన గ‌తి ప‌డుతుంద‌ని నిపుణుల క‌మిటీ స‌భ్యులొక‌రు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పావా షెల్స్‌ను మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని డిమాండ్ అన్ని రాజ‌కీయ పార్టీల నుంచి పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డుతుంద‌నే అంశంపైనే అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మై ఉంది.
First Published:  1 Sep 2016 7:33 AM GMT
Next Story