Telugu Global
Cinema & Entertainment

ఇద్దరు ముద్దుగుమ్మలతో సూర్య బంతాట

సూర్య సినిమాల్లో ఎక్కువగా ఇద్దరేసి ముద్దుగుమ్మలుంటాయి. కానీ ఒకేసారి ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన కథలు మాత్రం సూర్య చేయలేదు. తన సినిమాల్లో హీరోయిన్లు ఇద్దరు ఉన్నప్పటికీ, ఎవరో ఒకరికి మాత్రమే పరిమితం అయ్యేవాడు. కథ ప్రకారం నడుచుకునేవాడు. కానీ తొలిసారిగా సూర్య నారి నారి నడుమ మురారి తరహా సినిమా చేస్తున్నాడు. ఇద్దరు భామల ముద్దుల కృష్ణుడు అనే రొమాంటిక్ టచ్ ఇవ్వబోతున్నాడు. అవును… ఈ నెల రెండో వారం నుంచి ముత్తయ్య దర్శకత్వంలో సూర్య […]

ఇద్దరు ముద్దుగుమ్మలతో సూర్య బంతాట
X

సూర్య సినిమాల్లో ఎక్కువగా ఇద్దరేసి ముద్దుగుమ్మలుంటాయి. కానీ ఒకేసారి ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన కథలు మాత్రం సూర్య చేయలేదు. తన సినిమాల్లో హీరోయిన్లు ఇద్దరు ఉన్నప్పటికీ, ఎవరో ఒకరికి మాత్రమే పరిమితం అయ్యేవాడు. కథ ప్రకారం నడుచుకునేవాడు. కానీ తొలిసారిగా సూర్య నారి నారి నడుమ మురారి తరహా సినిమా చేస్తున్నాడు. ఇద్దరు భామల ముద్దుల కృష్ణుడు అనే రొమాంటిక్ టచ్ ఇవ్వబోతున్నాడు. అవును… ఈ నెల రెండో వారం నుంచి ముత్తయ్య దర్శకత్వంలో సూర్య చేయబోతున్న సినిమా కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది.

మొన్నటివరకు సింగం-3 షూటింగ్ లో సూర్య బిజీ అయిపోయాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆ సినిమా రాబోతోంది. ఇలాంటి యాక్షన్ మూవీ తర్వాత ఓ రొమాంటిక్ సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తాజాగా ఈకథకు ఓకే చెప్పాడు సూర్య. తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నాడు. నేను శైలజ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, సాలా ఖదూస్ సినిమాతో పేరుతెచ్చుకున్న రితికాసింగ్ లను సూర్య సినిమాలో హీరోయిన్లుగా తీసుకున్నారు.

Click to read

తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం

First Published:  1 Sep 2016 11:36 PM GMT
Next Story