Telugu Global
Cinema & Entertainment

దువ్వాడ  జ‌గ‌న్నాథ‌మ్  తో  కాజ‌ల్..! 

అల్లుఅర్జున్- హరీష్ శంకర్ కాంబోలో రానుంది ‘దువ్వాడ జగన్నాథమ్’. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి ఓ కొత్త విషయం బయటకువచ్చింది. హీరోయిన్‌గా కాజల్‌ని ఓకే చేసినట్టు గాసిప్స్ హంగామా చేసినా అలాంటిదేమీ లేదని, కొత్త బ్యూటీలను ఎంపిక చేసే పనిలో మేకర్స్ నిమగ్నమైనట్టు టాక్. బన్నీ పక్కన ఇంతవరకు నటించని అమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారట. కొత్త హీరోయిన్‌ని తీసుకుంటే బడ్జెట్ కూడా తక్కువలో అవుతుందని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ల కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్టు […]

దువ్వాడ  జ‌గ‌న్నాథ‌మ్  తో  కాజ‌ల్..! 
X
అల్లుఅర్జున్- హరీష్ శంకర్ కాంబోలో రానుంది ‘దువ్వాడ జగన్నాథమ్’. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి ఓ కొత్త విషయం బయటకువచ్చింది. హీరోయిన్‌గా కాజల్‌ని ఓకే చేసినట్టు గాసిప్స్ హంగామా చేసినా అలాంటిదేమీ లేదని, కొత్త బ్యూటీలను ఎంపిక చేసే పనిలో మేకర్స్ నిమగ్నమైనట్టు టాక్. బన్నీ పక్కన ఇంతవరకు నటించని అమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారట. కొత్త హీరోయిన్‌ని తీసుకుంటే బడ్జెట్ కూడా తక్కువలో అవుతుందని ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలో హీరోయిన్ల కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో వెలుగులోకి వచ్చింది హీరోయిన్ మెహరీన్‌. ఎట్ ప్రజెంట్ ఆమె అల్లుశిరీష్‌తో ఓ ఫిల్మ్ చేస్తోంది.ఈమె దాదాపుగా ఓకే అయినట్టు సమాచారం. అలాగే ‘జెంటిల్‌మన్’ మూవీతో ఫేమస్ అయ్యింది నివేద థామస్. ఆమె పేరు కూడా పరిశీలనలో వున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. ఇక ఐటెమ్‌సాంగ్‌కి కాజల్ లేదా కేథరీన్‌ల్లో ఒకర్ని ఓకే చేయవచ్చని అంటున్నారు. మొత్తానికి నటీనటుల ఎంపిక కాగానే వినాయక చవితి తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది డీజే!
First Published:  2 Sep 2016 11:42 PM GMT
Next Story