Telugu Global
Cinema & Entertainment

కాన్వెంట్ తెరిచే రోజు కన్ ఫర్మ్ చేశారు...

చిన్న సినిమాను ఎలా పెద్ద హిట్ గా మార్చాలో నాగార్జునకు తెలిసినట్టుగా మరే హీరోకు తెలీదు. గతంలో అష్టాచమ్మా అనే సినిమాను 200శాతం ప్రాఫిటబుల్ వెంచర్ గా మార్చేశాడు నాగ్. ఇప్పుడు ఈ హీరో నిర్మలా కాన్వెంట్ అనే మరో చిన్న సినిమాను నిర్మించాడు. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 16న నిర్మలా కాన్వెంట్ ను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఎలాంటి పోటీ లేకుండా […]

కాన్వెంట్ తెరిచే రోజు కన్ ఫర్మ్ చేశారు...
X

చిన్న సినిమాను ఎలా పెద్ద హిట్ గా మార్చాలో నాగార్జునకు తెలిసినట్టుగా మరే హీరోకు తెలీదు. గతంలో అష్టాచమ్మా అనే సినిమాను 200శాతం ప్రాఫిటబుల్ వెంచర్ గా మార్చేశాడు నాగ్. ఇప్పుడు ఈ హీరో నిర్మలా కాన్వెంట్ అనే మరో చిన్న సినిమాను నిర్మించాడు. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 16న నిర్మలా కాన్వెంట్ ను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఎలాంటి పోటీ లేకుండా చూసి, కాన్వెంట్ తెరవాలనుకుంటున్నాడు నాగ్.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎంత ప్రమోషన్ ఇవ్వాలో అంతా చేస్తున్నాడు నాగ్. తనే స్వయంగా ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. సొంతంగా ఓ పాట కూడా పాడాడు. ఆ పాట వీడియో కూడా రిలీజ్ చేశాడు. పుట్టినరోజు నాడు కూడా నిర్మలా కాన్వెంట్ కే ప్రయారిటీ ఇచ్చాడు. ఇలా ఈ సినిమాకు చాలా ప్రచారం కల్పిస్తున్నాడు నాగ్. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే కొత్తకొత్త భాష అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ట్రయిలర్ కూడా హిట్ అవ్వడంతో నిర్మలా కాన్సెంట్ పై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి.

First Published:  2 Sep 2016 10:26 PM GMT
Next Story