హమ్మయ్య… ప్రభాస్ ఓకే చేశాడు….

బాహుబలి-2 కంప్లీట్ అయిన వెంటనే సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ అందరికీ తెలిసిందే. నిజానికి ఇది చాలా పాత న్యూస్ కూడా. కానీ సుజీత్ రాసుకున్న స్క్రీన్ ప్లేను మాత్రం ప్రభాస్ తాజాగా విని ఓకే చేశాడు. ఇది లేటెస్ట్ న్యూస్. అవును.. బాహుబలి-2 భారీ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం యూనిట్ కు రెస్ట్ ఇచ్చాడు రాజమౌళి. ఈ గ్యాప్ లో సుజీత్ రాసిన స్క్రీన్ ప్లే మొత్తాన్ని ప్రభాస్ విన్నాడు. నిజానికి తన సినిమాకు సంబంధించి సుజీత్ ఎప్పుడో స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేశాడు. ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ గా కనిపించనున్నాడట. అయితే సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా టైం ఉన్నందున, స్క్రీన్ ప్లే మరింత బాగా వచ్చేందుకు ఇంకొన్ని మార్పులు చే్శాడట సుజీత్. ఆ మార్పుల్నే ప్రభాస్ కు వినిపించాడని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే మొత్తాన్ని మరోసారి విన్న ప్రభాస్… టోటల్ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. సినిమా ప్రారంభం అయ్యే సమయానికి స్టార్ హీరోయిన్లలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లను తీసుకోవాలని అనుకుంటున్నారు.

Also Read
  Hyper Movie Teaser