వెంక‌య్య‌కు క‌విత స్ర్టాంగ్ కౌంట‌ర్‌!

క‌మ‌లనాథుల‌కు నిజామాబాద్ ఎంపీ క‌విత స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ విమోచ‌నం దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తోన్న బీజేపీ నేత‌ల ఉద్దేశాన్ని క‌విత బ‌హిరంగంగానే ఎండ‌గ‌ట్టారు. భార‌త యూనియ‌న్‌లో తెలంగాణ విలీన‌మైన సెప్టెంబ‌రు 17న విమోచ‌న దినోత్స‌వంగానే ప‌రిగ‌ణించాల‌ని క‌మ‌ల‌నాథులు కొంత‌కాలంగా డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. ఇదే జ‌రిగితే.. హిందూ-ముస్లింల మ‌ధ్య ఉన్న సుహృద్భావ వాతావ‌ర‌ణం చెడ‌గొట్టినంత ప‌న‌వుతుంద‌న్న‌ది గులాబీ నేత‌ల ఆందోళ‌న‌. బీజేపికి కావాల్సింది ఇదేనా? అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉంటున్న ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌తం చిచ్చుపెట్టి ఓటు బ్యాంకు రాజ‌కీయం న‌డ‌పాల‌నుకుంటున్నారా? అని క‌మ‌ల‌నాథుల‌ను క‌విత సూటిగానే ప్ర‌శ్నించారు. స్థానిక బీజేపీ నాయ‌కుల మాట అటుంచితే కేంద్ర‌మంత్రి వెంక‌య్య కూడా ఇదే డిమాండ్ చేయ‌డం స‌రికాద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.  ఇలాంటి మ‌త రాజ‌కీయాలు చేయ‌డం బీజేపీకి కొత్తేం కాద‌ని ఎద్దేవా చేశారు. మ‌తాల మ‌ధ్య విభేదాలు సృష్టించి ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని ఆమె వెంక‌య్య‌కు హిత‌వు ప‌లికారు.

Click on Image to Read:

tulasi reddy

sujana satyam rama linga raju

cbn sakshi media acb

ys jagan kada maha darma 1

ys jagan kada maha darma

purandeshwari

kodela railway board

chandrababu naidu vote for note case judgement

undavalli arun kumar

lakshmi paravathi comments

babu mohan comments

sujana chowdary