Telugu Global
Cinema & Entertainment

 స‌మంత అంత సెక్సీగా క‌నిపించిందా?

అందాల భామ స‌మంత సినిమా సినిమాకి మ‌రింత అందంగా త‌యార‌వుతున్నారు. స‌మంత తాజా చిత్రం జ‌నతా గ్యారేజీ లోనూ ఆమె లుక్ యువ‌త‌ను క‌ట్టిప‌డేసింద‌ని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దివి నుంచి దిగివ‌చ్చావా ఆపిల్ బ్యూటీ అన్న పాట‌లో స‌మంత లుక్ అదిరిపోయింద‌ని కుర్రకారు సోష‌ల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ విష‌యంలో యువ‌కులే కాదు, ఆడ‌వారు కూడా స‌మంత అందంగా ఉంద‌న్న విష‌యాన్ని దాచుకోలేక‌పోతున్నారు.  సీనియర్ ఎడిటర్ లతా శ్రీనివాసన్ స్పంద‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల విడుద‌లైన జ‌నతా […]

 స‌మంత అంత సెక్సీగా క‌నిపించిందా?
X

అందాల భామ స‌మంత సినిమా సినిమాకి మ‌రింత అందంగా త‌యార‌వుతున్నారు. స‌మంత తాజా చిత్రం జ‌నతా గ్యారేజీ లోనూ ఆమె లుక్ యువ‌త‌ను క‌ట్టిప‌డేసింద‌ని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దివి నుంచి దిగివ‌చ్చావా ఆపిల్ బ్యూటీ అన్న పాట‌లో స‌మంత లుక్ అదిరిపోయింద‌ని కుర్రకారు సోష‌ల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ విష‌యంలో యువ‌కులే కాదు, ఆడ‌వారు కూడా స‌మంత అందంగా ఉంద‌న్న విష‌యాన్ని దాచుకోలేక‌పోతున్నారు. సీనియర్ ఎడిటర్ లతా శ్రీనివాసన్ స్పంద‌నే ఇందుకు నిద‌ర్శ‌నం.

ఇటీవ‌ల విడుద‌లైన జ‌నతా గ్యారేజీలోని దివినుంచి దిగివ‌చ్చావా పాట‌లో స‌మంత కొత్త లుక్‌లో క‌నిపించింది. అప్పుడెప్పుడో హాలీవుడ్‌లో కుర్ర‌కారు నిద్ర‌లేకుండా చేసిన అందాల భామ‌.. మార్లిన్ మ‌న్రో ఆహార్యంలో క‌నిపించారు స‌మంత‌. ఆమెలాంటి హెయిర్ స్ట‌యిల్‌, అదే లిప్‌స్టిక్‌లో మ‌రింత సెక్సీగా క‌నిపించారు. దీంతో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ సీనియర్ ఎడిటర్ లతా శ్రీనివాస‌న్ ట్వీట్ చేశారు. ఈ కామెంట్‌తో పొంగిపోయిన స‌మంత థాంక్యూ అని రీ ట్వీట్ చేసింది.

First Published:  5 Sep 2016 1:34 AM GMT
Next Story