Telugu Global
NEWS

జాతీయ మీడియా చెబుతున్న "ఆంధ్రా నయీం" ఈయనేనా?

నయీం. ఈ పేరు చెబితే తెలంగాణలో చాలా మంది వణికిపోయేవారు. అతడు చేసిన అకృత్యాలు అలాంటికి. ధన పిశాచి ఆవరించినట్టుగా డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా వడిగట్టేవాడు. నల్లగొండ జిల్లాలో నయీం పేరుతో ఏకంగా ట్యాక్స్ వసూలు చేశారు. అయితే ఇప్పుడు నయీం తరహా ట్యాక్స్ గుంటూరు జిల్లాలోనూ బాగా పాపులర్ అయింది. అయితే ఇక్కడ వసూలు చేస్తున్నది అధికార పార్టీ నేత కుటుంబమే. ఏపీలో మీడియా మొత్తం టీడీపీకి బాకా ఊదేదే కావడంతో ఆంధ్రానయీం ఆగడాలు […]

జాతీయ మీడియా చెబుతున్న ఆంధ్రా నయీం ఈయనేనా?
X

నయీం. ఈ పేరు చెబితే తెలంగాణలో చాలా మంది వణికిపోయేవారు. అతడు చేసిన అకృత్యాలు అలాంటికి. ధన పిశాచి ఆవరించినట్టుగా డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా వడిగట్టేవాడు. నల్లగొండ జిల్లాలో నయీం పేరుతో ఏకంగా ట్యాక్స్ వసూలు చేశారు. అయితే ఇప్పుడు నయీం తరహా ట్యాక్స్ గుంటూరు జిల్లాలోనూ బాగా పాపులర్ అయింది. అయితే ఇక్కడ వసూలు చేస్తున్నది అధికార పార్టీ నేత కుటుంబమే. ఏపీలో మీడియా మొత్తం టీడీపీకి బాకా ఊదేదే కావడంతో ఆంధ్రానయీం ఆగడాలు పెద్దగా బయటకు తెలియడం లేదు. లోకల్‌ మీడియా కళ్లుమూసుకున్నా జాతీయ మీడియా మాత్రం ఆంధ్రానయీంపై గట్టిగానే కథనాలు రాస్తోంది. సత్తెనపల్లి, నర్సరావుపేటలో సదరు సోకాల్డ్ పెద్దమనిషి కుటుంబసభ్యులు చేస్తున్న అరాచకాలపై టైమ్స్ గ్రూప్‌ ప్రముఖంగా కథనం ప్రచురించింది.

సదరు టీడీపీ పెద్దమనిషి నేత కుమారుడికి ఆంధ్రా నయీం అంటూ బిరుదు కూడా ఇచ్చేసింది. కాంట్రాక్టర్లు, ఏళ్ల తరబడి స్థానికంగానే బతుకుతున్న వ్యాపారుల రక్తాన్ని ఆంధ్రా నయీం ఏవిధంగా తాగుతున్నది వివరించింది. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజవర్గాల్లో ఏ పని చేయాలన్నా ముందుగా ఆంధ్రా నయీంకు మామూళ్లు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎవరి మధ్య అయినా వివాదం తలెత్తితే కోర్టుకు వెళ్లకూడదు. ఆంధ్రా నయీం ముందు సెటిల్ చేసుకుని సొమ్ము చెల్లించుకోవాలి. వీలుకాదంటే అంతే. పోలీసులను ప్రయోగిస్తారు. ఎస్సీఎస్టీల రక్షణ కోసం తెచ్చిన అట్రాసిటీచట్టాన్ని ఈ అగ్రకుల నాయకుడు అస్త్రంగా తీస్తాడు. ఎలాగో ఉన్నది తమ ప్రభుత్వం, తన పోలీసులే కాబట్టి తప్పుడు ఎస్సీఎస్టీ కేసులు పెట్టి లోపలేయిస్తారు. అందుకే చాలా మంది వ్యాపారులు సొంతూరులోనే మామూళ్లు ఇచ్చుకుని బతుకుతున్నారు. ఆ మధ్య మామూళ్లు ఇచ్చేందుకు ఒప్పుకోని ఒక కాంట్రాక్టర్‌పై సదరు ముఖ్యనేత అనుచరులు దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకుఫిర్యాదు చేశారు. అంతే వెంటనే తిరిగి కాంట్రాక్టర్‌పై ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. ఒక దళిత మహిళ పేరుతో కేసు పెట్టించారు. అయితే సదరు దళిత మహిళ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ కాంట్రాక్టర్‌ను తాను చూడలేదని చెప్పింది. జాతీయ ఆంగ్ల వార్తపత్రిక ఈ విషయాన్ని ప్రముఖంగా ఎత్తిచూపింది. లిక్కర్ వ్యాపారంలో 50 శాతం వాటాను ఆంధ్రా నయీం డిమాండ్ చేయగా అందుకు తిరస్కరించిన ఒక వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసిన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఆంధ్రా నయీం దగ్గర సెటిల్‌మెంట్‌కు నిరాకరించిన ఒక స్టాంప్ వెండర్‌పైనా తప్పుడు కేసులు పెట్టి లోపలేశారు.

ఈ ఆంధ్రా నయీం ఆగడాలు పతాక స్థాయికి చేరాయన్నట్టుగా జాతీయ ఆంధ్ర పత్రిక మరో ఉదంతాన్ని కూడా ఎత్తిచూపింది. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే పనులు రూ. 108కోట్లతో చేపట్టారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సదరు టీడీపీ నేత కుమారుడు 25 కోట్లు డిమాండ్ చేశారు. రైల్వే కాంట్రాక్టర్ అందుకు ఓప్పుకోకపోవడంతో అనుచరులను పంపించి పనులు చేస్తున్న ప్రాంతంలో కూలీలు, రైల్వే సిబ్బందిని కర్రలు, రాడ్లతో చావగొట్టారు. ఇద్దరు రైల్వే సిబ్బందిని కూడా తనతో పాటు ఎత్తుకెళ్లారు. ఈ విషయం కేంద్ర రైల్వే శాఖ మంత్రి వరకువెళ్లింది. రైల్వే బోర్డు ఏపీ సీఎస్‌కు ఘాటుగా లేఖ కూడా రాసింది. అధికార పార్టీ నేతలు ఏకంగా రైల్వే కాంట్రాక్టర్లనే బెదిరిస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది. అసలు అక్కడ రైల్వే పనులు చేయాలో వద్దో తేల్చుకుని తమకు చెప్పాలని ఘాటుగా హెచ్చరించింది. ఈ రైల్వే పనులను అడ్డుకున్నది స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ అన్నది జగమెరిగిన సత్యమే. టీడీపీ అనుకూల పత్రికలు మౌనంగా ఉన్నా రైల్వే సిబ్బందిపై దాడి చేసిన విషయాన్ని మిగిలిన పత్రికలు ప్రముఖంగానే ప్రచురించాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో రైల్వే పనులు గానీ, ఇతర పనులు గానీ చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని దుస్థితి ఏర్పడింది. అంతేకాదు టైమ్స్‌ గ్రూప్ పత్రిక మరో ఉదంతాన్ని కూడా ఉదహరించింది.

స్థానికంగా తన ప్రత్యర్థి కేబుల్‌ టీవీ కార్యాలయాన్ని ఇటీవల కోడెల అనుచరులు ధ్వంసం చేశారు. స్థానికంగా కోడెలకు చెందిన కేబుల్ నెట్‌వర్క్ మాత్రమే ఉండాలన్నది వారి ఉద్దేశం. దీనిపై బాధితుడైన కేబుల్ యజమాని హైకోర్టును కూడా ఆశ్రయించారు. దాడి జరిగిన రోజు పోలీసులకు స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు శివరామకృష్ణ ఫోన్లలో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ దాడి చేయించారని బాధితుడు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు దాడి జరిగిన సమయంలో పోలీసుల కాల్‌ డేటా మొత్తం భద్రపరచాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశించింది. కేబుల్ ఆఫీస్ పై దాడి సమయంలో స్పందించిన జిల్లా ఎస్సీ నాయక్… ప్రజలకు ఒక ఉచిత సలహా పడేశారు. ప్రజలు కేబుల్ వాడడం మానేసి డిష్ టీవీల వైపు మొగ్గుచూపాలని సూచించారట. ఎస్సీ ప్రకటన బట్టే ఇక్కడ పోలీసులు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఆంగ్లపత్రికలో వచ్చిన కథనాలను బట్టి చూస్తుంటే వారు చెబుతున్న ”ఆంధ్రా నయీం” … స్పీకర్ కుమారుడు కోడెల శివరామకృష్ణ అని భావిస్తున్నారు.

Click on Image to Read:

purandeswari1

tulasi reddy

sujana satyam rama linga raju

jairam ramesh

pawan

ysrcp mla

cbn sakshi media acb

First Published:  5 Sep 2016 12:03 PM GMT
Next Story