Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

రెండో సినిమా కోసం లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాడు అఖిల్. ఇక మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదనే ఉద్దేశంతో స్వయంగా నాగార్జున రంగంలోకి దిగి, అఖిల్ రెండో సినిమాను కన్ ఫర్మ్ చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుందని నాగార్జున ఇటీవలే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని సంగతుల్ని బయటపెట్టాడు నాగ్. నవంబర్ నుంచి విక్రమ్ కుమార్-అఖిల్ కలిసి సెట్స్ […]

అఖిల్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది
X

రెండో సినిమా కోసం లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాడు అఖిల్. ఇక మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదనే ఉద్దేశంతో స్వయంగా నాగార్జున రంగంలోకి దిగి, అఖిల్ రెండో సినిమాను కన్ ఫర్మ్ చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుందని నాగార్జున ఇటీవలే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని సంగతుల్ని బయటపెట్టాడు నాగ్. నవంబర్ నుంచి విక్రమ్ కుమార్-అఖిల్ కలిసి సెట్స్ పైకి వెళ్తారని స్పష్టంచేశాడు.

నిజానికి మనం సినిమా సెట్స్ లో ఉంటుండగానే అఖిల్ కోసం కథ సిద్ధంచేశాడట విక్రమ్ కుమార్. కాకపోతే ఆ కథలో అఖిల్ నటించాలంటే మరింత అనుభవం అవసరం అనే ఉద్దేశంతో…మొదట వీవీ వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేశారట. ఇప్పుడు ఆ ఒక్క సినిమా అనుభవంతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. మరోవైపు విక్రమ్ కుమార్ ఈమధ్యే పెళ్లి కూడా చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో… అఖిల్ సినిమాను నవంబర్ కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి.

Click to Read

అపరిచితుడికి ఇ‍ంకొకడి ద్వారా హిట్ కొడతాడా ? అపరిచితుడికి ఇ‍ంకొకడి ద్వారా హిట్ కొడతాడా ?
First Published:  5 Sep 2016 10:07 PM GMT
Next Story