హేమాహేమీలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించిన జగన్

ఏపీలో త్వరలో జరగనున్న కొన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలపై వైసీపీ అప్పుడే కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో జగన్‌ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత జరిగే ఎన్నికలు ఇవే కావడంతో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. చంద్రబాబుపై ప్రజావ్యతిరేకత ఎంతుంది అన్నది ఈ ఎన్నికల్లో పరోక్షంగా బయటపడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్, మున్సిపాలిటీలకు వైసీపీ ఇన్‌చార్జ్‌ల టీంను ప్రకటించింది. ప్రతి చోట వ్యూహాత్మకంగానే ఇన్‌చార్జ్‌లను నియమించినట్టుగా ఉంది. ఒక్కో నేతను కాకుండా ఒక్కో చోట ఒక్కో టీంకు బాధ్యతలు అప్పగించారు.

  1. ప్రతిష్టాత్మకమైన విశాఖ కార్పొరేషన్ పరిశీలకులుగా విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, దాడిశెట్టి రాజా, మేరుగ నాగార్జునను నియమించారు.

2. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా సీనియర్ నేత బొత్ససత్యనారయణ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, చీర్ల జగ్గిరెడ్డి, చలమలశెట్టి సునీల్కు బాధ్యతలు అప్పగించారు.

3. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, బెల్లన చంద్రశేఖర్, రాజాం మున్సిపాలిటీ పరిశీలకులుగా బొత్స అప్పలనర్సయ్య, పాలవలస రాజశేఖరంలను నియమించారు.

4. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మున్సిపాలిటీ పరిశీలకులుగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ధర్మాన కృష్ణదాస్ లను నియమించారు.

5. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎంపీ మిథున్రెడ్డి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధిలను నియమించారు.

6. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందా రెడ్డి, సామినేని ఉదయభాను, కందుకూరు మున్సిపాలిటీ పరిశీలకులగా ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్రెడ్డి, జంకా వెంకటరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

7. కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కె.సురేశ్బాబు లను నియమించారు.

8. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, వై.విశ్వేశ్వర్రెడ్డి, అంజాద్ బాషా లను నియమించారు.

9. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకులుగా ఎమ్మెల్యే డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

Click on Image to Read:

bhumana karunakar reddy1

roja budda venkanna

chevi reddy bhaskar reddy

atal bihari vajpayee book

tdp mla

mla srikanth

amaravathi capital lands

kvp ys jagan

kodela shiva rama krishna 1

lokesh vivekanda reddy ys jagan

bhumana karunakar reddy

cpi ramakrishna

ysrcp mla house arrest

america china

rosaiah

purandeswari1

nagarjuna 1

rgv