రోజాపై బుద్దావెంకన్న తీవ్ర వ్యాఖ్యలు

కరువుకు ఫ్యాంటు షర్టు వేస్తే చంద్రబాబులా ఉంటుందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు. రోజా ఒక శని అని విరుచుకుపడ్డారు. శనికి చీరా జాకెట్ కడితే అది రోజా అని విమర్శించారు. రోజా టీడీపీలో ఉన్నంత కాలం తమకు శని పట్టిందన్నారు. రోజా వైఎస్‌ను కలవగానే ఆయన చనిపోయారని, జగన్‌ జైలుకు వెళ్లారని విమర్శించారు. రోజా ఐరన్ లెగ్ అన్న విషయం రాష్ట్రమంతా తెలుసన్నారు. ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయం చేయడం మానుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు.

మంత్రి పీతల సుజాత కూడా రోజా వ్యాఖ్యలను తప్పుపట్టారు. వైసీపీ నేతలకు మనుషులను చంపే గన్‌లు తప్ప… నీరందించే రెయిన్ గన్‌ల గురించి తెలియదన్నారు. రెయిన్‌ గన్స్ ద్వారా నీరందించి ప్రతి రైతు కళ్లలో చంద్రబాబు ఆనందం చూశారన్నారు. విహారయాత్రలకు చంద్రబాబు ఒక్కరే వెళ్లారా ప్రతిపక్ష నేత జగన్‌ కూడా గతంలో అనేకసార్లు వెళ్లారు కదా అని పీతల సుజాత వ్యాఖ్యానించారు.

Click on Image to Read:

bhumana karunakar reddy1

chevi reddy bhaskar reddy

atal bihari vajpayee book

tdp mla

mla srikanth

amaravathi capital lands

kvp ys jagan

kodela shiva rama krishna 1

lokesh vivekanda reddy ys jagan

bhumana karunakar reddy

cpi ramakrishna

ysrcp mla house arrest

america china

rosaiah

purandeswari1

nagarjuna 1

rgv