Telugu Global
Cinema & Entertainment

తాత మాజీ ప్ర‌ధాని.. తండ్రి  మాజీ సీఎం... అందుకే తొలి సినిమాకే 75 కోట్లు బ‌డ్జెట్...

రాజ‌కీయం ..సినిమా రెండు  ఎవ‌ర్ గ్రీన్ గ్లామ‌ర్  ఫీల్డ్స్ అనే చెప్పాలి. మ‌రి ఇవి రెండు ఒకే కుటుంబంలో వుంటే  .. ఆ ఫ్యామిలీ నుంచి ఒక పిల్లాడు హీరోగా ( నిఖిల్ గౌడ‌)ప‌రిచ‌యం అవుతుంటే  సినీమా ఎలా వుంటుంది అంటే  హండ్రెట్ ప‌ర్సెంట్   మాజి ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు నిఖిల్ గౌడ‌ తెరంగ‌ట్ర‌మ్ లా ఉంటుంది.   జాగ్వార్‌ పేరు తో  కుమార స్వామి త‌న‌యుడు  హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే ధూమ్  సినిమా […]

తాత మాజీ ప్ర‌ధాని.. తండ్రి  మాజీ సీఎం... అందుకే తొలి సినిమాకే 75 కోట్లు బ‌డ్జెట్...
X

రాజ‌కీయం ..సినిమా రెండు ఎవ‌ర్ గ్రీన్ గ్లామ‌ర్ ఫీల్డ్స్ అనే చెప్పాలి. మ‌రి ఇవి రెండు ఒకే కుటుంబంలో వుంటే .. ఆ ఫ్యామిలీ నుంచి ఒక పిల్లాడు హీరోగా ( నిఖిల్ గౌడ‌)ప‌రిచ‌యం అవుతుంటే సినీమా ఎలా వుంటుంది అంటే హండ్రెట్ ప‌ర్సెంట్ మాజి ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు నిఖిల్ గౌడ‌ తెరంగ‌ట్ర‌మ్ లా ఉంటుంది. జాగ్వార్‌ పేరు తో కుమార స్వామి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే ధూమ్ సినిమా రేంజ్ తో అంచ‌నాలు పెంచేశాయి.

త‌న కుమారుడిని ఫ‌స్ట్ ఫిల్మ్ తోనే సూప‌ర్ స్టార్ ను చేయాలని త‌ల‌చిన‌ట్లున్నారు కుమార స్వామి. సినిమా ఎన్ని కోట్లతో తెరకెక్కింది కాదన్నయ్యా.. ఎన్ని కోట్లతో పబ్లిసిటీ చేశామన్నదే ముఖ్యం.. అన్నట్లుగా, సినిమాకి పబ్లిసిటీ చేయనున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక కోసం కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేయనున్నారట. తమిళ, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా, రాజకీయ ప్రముఖులూ ఈ వేడుకలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, కుమారస్వామి – పవన్‌కళ్యాణ్‌ ఆశీస్సుల కోసం హైద్రాబాద్‌కి వచ్చి, ఏకంగా పవన్‌ సోదరుడిగా తన కుమారుడు నిఖిల్‌ని ప్రకటించేసిన విషయం విదితమే.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ తదితరులతోనూ త్వరలో సమావేశం కానున్నారట కుమారస్వామి. అదే సమయంలో, పలువురు తమిళ సినీ ప్రముఖులతోనూ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు. మ‌రి రాజ‌కీయం..సినిమా రెండు క‌ల‌గ‌లిసి వ‌స్తున్న ‘జాగ్వార్‌’ చిత్రం హైప్‌ తెచ్చేందుకు పడ్తున్న పాట్లు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇండియ‌న్ హిస్ట‌రిలో ఒక డెబ్యూ హీరోకు 75 కోట్లు బ‌డ్జెట్ పెట్ట‌డం అనేది ఇదే తొలిసారి అంటున్నారు విశ్లేషుకులు. మ‌రి ఈ హైపు ప‌రిణామాలు ఎలా వుంటాయో సినిమా విడుద‌లైతే గాని తెలియ‌దు. ఇంత‌కు ఈ చిత్రానికి క‌థ‌ను అందించింది రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ అనే విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌క‌త్వం కూడా మ‌న తెలుగు ద‌ర్శ‌కుడు మ‌హ‌దేవ్ చేశాడు.

First Published:  6 Sep 2016 6:17 AM GMT
Next Story