Telugu Global
Cinema & Entertainment

నా సావు నేను చ‌స్తా  డైలాగ్ తో మ‌హేష్ ను ఇంప్రెస్ చేశాడు..!

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏది అని ఎవరినడిగినా… అందరినోటా వచ్చే మొదటి పేరు ‘పెళ్లి చూపులు’ మూవీ. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టయిన ఈ చిత్రంలోని డైలాగులు, కామెడీ సీన్లు ఇంకా ఎవరూ మరిచిపోలేక పోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను తెగ నవ్వించారు. సినిమాలో ఓ సీన్లో ప్రియదర్శి […]

నా సావు నేను చ‌స్తా  డైలాగ్ తో మ‌హేష్ ను ఇంప్రెస్ చేశాడు..!
X

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏది అని ఎవరినడిగినా… అందరినోటా వచ్చే మొదటి పేరు ‘పెళ్లి చూపులు’ మూవీ. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టయిన ఈ చిత్రంలోని డైలాగులు, కామెడీ సీన్లు ఇంకా ఎవరూ మరిచిపోలేక పోతున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను తెగ నవ్వించారు. సినిమాలో ఓ సీన్లో ప్రియదర్శి చెప్పిన ‘నా చావు నే చస్తా.. నీకెందుకు’ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే… ప్రియదర్శికి తాజాగా భారీ ఆఫర్ వచ్చింది. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ దెబ్బతో ప్రియదర్శి దశ తిరిగినట్లే, ఈ సినిమాలో క్లిక్ అయితే అతను తెలుగులో పెద్ద కమెడియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారంతా.

ముఖ్యంగా అతడు డైలాగులు చెప్పే విధానం, డైలాగ్ డెలివరీ స్లాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం……

First Published:  6 Sep 2016 6:06 AM GMT
Next Story