Telugu Global
Cinema & Entertainment

అపరిచితుడికి ఇ‍ంకొకడి ద్వారా హిట్ కొడతాడా ?

విక్రమ్ అంటే మ‌న‌కు ఒక శివ‌పుత్రుడు.. ఒక అప‌రిచితుడు వంటి చిత్రాలు గుర్తుకు వ‌స్తాయి. విక్ర‌మ్ బై బ‌ర్త్ త‌మిళ‌య‌న్ . ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది మాత్రం తెలుగు. న‌టుడిగా నిల‌దొక్కుకోవ‌డానికి దాదాపు 10 ఏళ్ల స్ట్ర‌గుల్ చేశారు. సినిమా అంటే అంతులేని ప్యాష‌న్. సినిమా కోసం విక్ర‌మ్ డెడికేష‌న్ కు ఎవ‌రైన ఫిధా కావాల్సిందే. ఆయ‌న కెరీర్ లో హిట్స్ ఉన్నాయి. అంత‌కు మించి ఫ‌ట్స్ కూడా వున్నాయి. అయితే విక్ర‌మ్ అభిమానులు మాత్రం. […]

అపరిచితుడికి ఇ‍ంకొకడి ద్వారా హిట్ కొడతాడా ?
X

విక్రమ్ అంటే మ‌న‌కు ఒక శివ‌పుత్రుడు.. ఒక అప‌రిచితుడు వంటి చిత్రాలు గుర్తుకు వ‌స్తాయి. విక్ర‌మ్ బై బ‌ర్త్ త‌మిళ‌య‌న్ . ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది మాత్రం తెలుగు. న‌టుడిగా నిల‌దొక్కుకోవ‌డానికి దాదాపు 10 ఏళ్ల స్ట్ర‌గుల్ చేశారు. సినిమా అంటే అంతులేని ప్యాష‌న్. సినిమా కోసం విక్ర‌మ్ డెడికేష‌న్ కు ఎవ‌రైన ఫిధా కావాల్సిందే. ఆయ‌న కెరీర్ లో హిట్స్ ఉన్నాయి. అంత‌కు మించి ఫ‌ట్స్ కూడా వున్నాయి. అయితే విక్ర‌మ్ అభిమానులు మాత్రం. తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న‌ట్లు ఉంటారు. అంటే సినిమా హిట్ , ఫ‌ట్ తో సంబంధం లేకుండా ఇష్ట‌ప‌డ‌తారు. కేవ‌లం యాక్టింగే కాదు.. ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించి ఏ క్రాఫ్ట్ అయినా విక్ర‌మ్ కు ఇష్ట‌మే.

అందుకే విక్ర‌మే స్వ‌యంగా ఐ ల‌వ్ సినిమా. ఐ ఈట్ సినిమా . ఐ స్లీప్ సినిమా అంటారు . స‌రే ఎంత ప్యాష‌న్ ఉన్న‌ప్ప‌టికి… క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మ‌రి గ‌తంలో ఐ చిత్రం కోసం దాదాపు 3 సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి చేశాడు. అయితే ఆ సినిమా పాజిటివ్ రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. మ‌రి తాజాగా ఆనంద్ శంక‌ర్ అనే యంగ్ డైరెక్ట‌ర్ చేసిన ఇంకొక్క‌డు చిత్రం గురువారం తెలుగులో డ‌బ్బింగ్ చిత్రం గా రిలీజ్ అవుతుంది. మ‌రి ఈ చిత్ర‌మైన విక్ర‌మ్ కు ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Click to Read

ప్రియాంకా చోప్రా అలా చేసిందా? ప్రియాంకా చోప్రా అలా చేసిందా?

First Published:  6 Sep 2016 12:15 AM GMT
Next Story