అనుష్క లుక్ బావుందండోయ్..! 

నాగార్జున‌, రాఘ‌వేంద్ర రావు కాంబినేష‌న్ లో   తెర‌కెక్కుతున్న   ఓం న‌మో  వెంక‌టేశాయ  చిత్రంలో   అనుష్క లుక్  రిలీజ్ చేశారు. తిరుప‌తి  వెంక‌టేశ్వ‌ర స్వామి  భ‌క్తుడు హ‌థిరామ్ బాబ  జీవిత క‌థ ఆధారంగా  రాఘవేందర్ రావు  ఈ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. హథిరామ్ బాబా రోల్ ను నాగార్జున చేస్తున్నారు.  ఈ చిత్రం లో అనుష్క ఒక  కీ రోల్ చేస్తుంది.  మీడియాకు  అనుష్క లుక్ రిలీజ్ చేశారు.  మెడ‌లో న‌గ‌లు ధరించి  పూల మాల‌లు ధ‌రించి  అనేక చేతుల‌తో  ఒక నృత్య భంగిమ‌లో  వున్న అనుష్క లుక్   అభిమానుల్ని అల‌రించే విధంగా ఉంది .